Netflix- Amazon: అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్… ఈ మూడు ఓటీటీలు కూడా అమెరికా దేశానికి చెందినవే. కానీ మనదేశంలో బహుళ ప్రాచుర్యం పొందాయి.. ఇవి వచ్చిన తర్వాత మేల్కొన్న దేశీయ ఓటీటీ సంస్థలు లోకల్ కంటెంట్ తో దూసుకుపోతున్నాయి.. ఈ మూడు ఓటీటీ లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో ఆహా లోకల్ కంటెంట్ తో రచ్చ లేపుతోంది. ఇటీవల నందమూరి బాలకృష్ణ, ప్రభాస్ తో నిర్వహించిన అన్ స్టాపబుల్ టాక్ షో స్ట్రీమింగ్ అయితే… దెబ్బకు సర్వర్ డౌన్ అయింది.. దీని తెర వెనుక కారణాలు వేరే ఉన్నప్పటికీ…ఆహా టీం అలా ప్రచారం చేసుకున్నది.. కానీ ఇదే విషయంలో మిగతా ఓటీటీలు వెనుకపడ్డాయనే చెప్పవచ్చు. మరోవైపు ఓటీటీ ల్లో స్థానిక అంశాలను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక అమెజాన్ తో పోలిస్తే నెట్ ప్లిక్స్ లో ప్రాంతీయ భాషల సినిమాలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి.. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ ను ఢీకొట్టేందుకు నెట్ ఫ్లిక్స్ సమాయత్తమవుతోంది.. ఇందులో భాగంగానే భారీగా సినిమాలను కొనుగోలు చేసింది.

ఏకంగా 17 సినిమాలు
నెట్ ఫ్లిక్స్.. 2023లో తన భవిష్యత్తు ప్రణాళికలను బలంగా రూపొందించుకుంది.. తెలుగులో మార్కెట్ పెంచుకునేందుకు ఏకంగా 17 సినిమాలు కొనుగోలు చేసింది. ఇందులో కొన్ని సినిమాలు ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు. భోళా శంకర్, ధమాకా, అమిగోస్, బడ్డీ, దసరా, బుట్ట బొమ్మ, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న కార్తికేయ 8వ చిత్రం, కిరణ్ అబ్బవరం “మీటర్”, 18 పేజేస్, నాగ శౌర్య సినిమా, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న అనుష్క సినిమా, సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న పంజా విష్ణవ్ తేజ్ హీరోగా తీస్తున్న సినిమా, టిల్లు 2, వరుణ్ తేజ్ 12వ సినిమా, సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష, మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాల డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్న నేపథ్యంలో అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్.. వెస్ట్రన్ మార్కెట్లో ఖర్చులను దారుణంగా తగ్గించాయి. ఉద్యోగులను కూడా తొలగించాయి. అని అదే సమయంలో ఇండియన్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. వెబ్ సిరీస్ లు, ప్రాంతీయ భాష సినిమాలను కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఈ రేసులో నంబర్ వన్ గా నిలవాలని నెట్ ఫ్లిక్స్ యోచిస్తోంది..అందులో భాగంగానే భారీగా సినిమాల డిజిటల్ రైట్స్ కొనుగోలు చేస్తున్నది.