Viral News: మనిషికి తోక ఉండటం మీరు ఎప్పుడైనా చూశారా.. సాధారణంగా జంతువులకు కదా తోక ఉండేది. మరి మనుషులకి ఎలా ఉంటది.. అనుకుంటున్నారా.. ప్రపంచంలో ఎన్నో వింతలు చూశాం. రెండు తలలతో శిశువు జన్మించడం.. అదనంగా చేతి వేళ్లు ఉండటం.. పిల్లికి కుక్క పాలివ్వడం, మూడు కన్నులతో గేదె జన్మించడం, గుడి చూట్టూ జంతువులు ప్రదక్షిణలు చేయడం.. ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన ఘటలను చూశాం. ఇలాంటిదే నేపాల్‌కు చెందిన ఓ యువకుడి విషయంలో కూడా జరిగింది. అతడికి వెనక భాగంలో తోక ఉంది. వీపు నుంచి పొడవైన తోక బయటకు రావడంతో.. నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తున్నాడు ఆ యువకుడు. నేపాల్ లోని ఓ యువకుడికి తోక ఉన్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇప్పుడు వైరల్ గా మారింది.

దేశాంత్ అధికారి అనే 16 ఏళ్ల యువకుడికి వీపువైపు వెన్నుపూస ఉండేచోట వెంట్రుకలతో నిండిన 70 సెంటీ మీటర్ల పొడవున్న తోక ఉంది. అయితే.. తను పుట్టిన కొన్ని రోజుల తర్వాత అతని తల్లిదండ్రులు తోకను గుర్తించినట్టు చెప్తున్నారు. దానికోసం చాలా ఆస్పత్రుల చుట్టూ తిరిగామంటున్నారు. విదేశాల్లోని డాక్టర్లను కూడా సంప్రదించామని.. కానీ ఫలితం లేకపోయిందని అంటున్నారు.
Also Read: Pawan Kalyan: జగన్ పరిహారం.. ఒక పరిహాసం.. ప్రశ్నించిన పవన్
కొన్నాళ్ల తర్వాత దేశాంత్ హనుమంతుడి పునర్జన్మ అని స్థానిక పూజారి చెప్పాడని అతని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆ మాట విని ఎంతో ఆనందంగా అనిపించిందని పేర్కొన్నారు. అయితే.. తోక కారణంగా దేశాంత్ మొదట్లో చాలా ఇబ్బంది పడే వాన్నని చెప్తున్నాడు. తనకు తోక ఉందని ఓ యూట్యూబ్ చానల్ లతో వచ్చిన వీడియోతో ఒకప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని దేశాంత్ చెప్పాడు. ఇప్పుడు తనకున్న తోకను చూపించడంలో ఎలాంటి ఇబ్బంది లేదంటున్నాడు. చాలామంది ప్రత్యేకంగా చూస్తున్నారని, పూజిస్తున్నారని.. గౌవరవిస్తున్నారని చెప్పుకొచ్చాడు. హనుమాన్ అని కూడా పిలుస్తున్నారని దేశాంత్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇది హనుమంతుడి అవతారమని హిందూ పండితులు చెప్పడంతో.. దేశాంత్ దానిని కత్తిరించలేదు. అప్పటి నుంచీ ఆ తోకను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మరింతగా పెంచుతున్నాడు.

శరీరం అవయవాల్లో అంతర్గతంగా జరిగిన మార్పుల వల్లే ఇలా జరిగి ఉండవచ్చని.. దానిని దేవుడితో ముడిపెట్టడం కరెక్టు కాదని కొందరు అంటున్నారు. దేశాంత్ తోక గురించి వైద్య నిపుణులు స్పందిస్తూ.. జన్యుపరమైన సమస్యల వల్ల కొందరిలో ఇలాంటి అరుదైన ఘటనలు జరుగుతాయని అంటున్నారు.
Also Read:Nellore Politics: నెల్లూరులో కాక రేపుతున్న కాకాని.. అనిల్ యాదవ్ కు ముచ్చెమటలు