Nayanthara: నయనతార లేటెస్ట్ మూవీ కనెక్ట్. ఈ చిత్ర ప్రమోషన్స్ పాల్గొన్న ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితంపై వెలువడిన కథనాలు, వార్తలను ఉద్దేశిస్తూ నయనతార ఒకింత అసహనం వ్యక్తం చేశారు. నా వ్యక్తిగత జీవితంలోకి పరిమితికి మించి తొంగి చూశారు. బహుశా నేను ఉన్న ఫీల్డ్ దానికి కారణం కావచ్చు. ఒక దశ వరకు ఓకే. కానీ హద్దులు దాటి నా పర్సనల్ లైఫ్ లోకి చొచ్చుకు వచ్చారని నయనతార కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా నయనతార కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కెరీర్ బిగినింగ్ నుండి నయనతార జీవితం వివాదాలమయమే. ఎఫైర్ రూమర్స్ ఆమెను తరచుగా వార్తల్లో నిలిచేలా చేశాయి. పరిశ్రమలో అడుగుపెడుతూనే హీరో శింబుతో నయనతార ప్రేమాయణం మొదలుపెట్టారు. ఏళ్ల తరబడి వీరి మధ్య బంధం నడిచింది. సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ ఫోటోలు కూడా బయటకు రావడం సంచలనమైంది. శింబుతో బ్రేకప్ చెప్పిన కొన్నాళ్ళకు పెళ్ళైన ప్రభుదేవాకు దగ్గరయ్యారు. ఆయనతో చెట్టాపట్టాలేసుకొని తిరిగి నయనతార పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డారు.
నయనను వివాహం చేసుకునేందుకు ప్రభుదేవా భార్యకు విడాకులు ఇచ్చాడు. అది వివాదాస్పదం అయ్యింది. నయనతార తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రభుదేవాతో కూడా ఆమె బంధం పెళ్లి వరకు వెళ్ళలేదు. 2015లో నయనతార ఫ్రెష్ గా విగ్నేష్ శివన్ దగ్గరయ్యారు. గత అనుభవాల నేపథ్యంలో విగ్నేష్ శివన్ తో కూడా నయనతార చివరి వరకు ఉండరనే ప్రచారం జరిగింది. ఏళ్ళు గడుస్తున్నా పెళ్లి మాట ఎట్టకపోవడంతో విడిపోయే సూచనలుకలవంటూ పుకార్లు తెరపైకి వచ్చాయి.

ఈ ఏడాది నయనతార-విగ్నేష్ పెళ్లి పీటలు ఎక్కారు. దీంతో బ్రేకప్ రూమర్స్ కి తెరపడింది. పెళ్ళైన వెంటనే తిరుమల మాడవీధుల్లో చెప్పులతో తిరిగి వివాదంలో ఇరుక్కున్నారు. ఇటీవల సరోగసి ద్వారా పేరెంట్స్ అయ్యామని ప్రకటించి మరో వివాదంలో చిక్కుకున్నారు. పెళ్ళైన నెలల వ్యవధిలో పేరెంట్స్ అయ్యామన్న నయనతార-విగ్నేష్ సరోగసీ చట్టాలు ఉల్లఘించారమే సందేహంతో తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తాము ఐదేళ్ల క్రితమే వివాహం చేసుకున్నాము, సరోగసీ నిబంధనలు ఉల్లంగించలేదని ఆధారాలు చూపి బయటపడ్డారు.