18 Pages Pre-Release Business: కెరీర్ ప్రారంభం నుండి నేటి వరకు విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని దక్కించుకున్న యంగ్ హీరో నిఖిల్ , ఈ ఏడాది కార్తికేయ 2 చిత్రం తో పాన్ ఇండియన్ లెవెల్ లో ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడో అందరికి తెలిసిందే..కనీసం 30 కోట్ల రూపాయిలు మార్కెట్ కూడా లేని నిఖిల్ కి ఏకంగా 60 కోట్ల రూపాయిల షేర్ కలెక్షన్స్ ని తెచ్చి పెట్టింది ఈ సినిమా.

కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా ప్రభంజనం సృష్టించి నిఖిల్ ని పాన్ ఇండియన్ స్టార్ హీరోలలో ఒకరిగా నిలిపింది ఈ చిత్రం..అంతతి సంచలన విజయం సాధించిన సినిమా తర్వాత ఆయన చేసిన ’18 పేజెస్ ‘ అనే సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి కథ అందించగా , సూర్య ప్రతాప్ అనే నూతన డైరెక్టర్ ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు.
గీత ఆర్ట్స్ సమర్పణ లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించాడు..కార్తికేయ 2 చిత్రం లో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది..ఈమధ్యనే విడుదల చేసిన ట్రైలర్ కి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది..అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే అన్ని ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి..అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.

ఎందుకంటే ఈ సినిమా కి ముందు నిఖిల్ సినిమాల థియేట్రికల్ బిజినెస్ కనీసం 12 కోట్ల రూపాయిలు కూడా దాటేవి కాదు..అలాంటిది ఇప్పుడు ఆయన ఈ సినిమా ద్వారా ఏకంగా 22 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసాడు..వీటితో పాటు నాన్ థియేట్రికల్ మరియు ఆడియో రైట్స్ కలిపి ఈ సినిమాకి 50 కోట్ల రూపాయిల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని అంచనా వేస్తున్నారు..నిఖిల్ మార్కెట్ ఈ రేంజ్ లో పెరుగుతుందని ఎవ్వరు ఊహించలేదు..కార్తికేయ 2 లాగానే ఈ సినిమా కూడా భారీ హిట్ అవుతుందో లేదో చూడాలి.