Nayanthara Wedding: నయనతార పెళ్లి పనులతో ఫుల్ బిజీగా ఉంది. కాబోయే భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి ఆమె స్వయంగా పెళ్లి పనులు చూసుకుంటుంది. పెళ్లి షాపింగ్ దగ్గర నుంచి , ఆహ్వానపత్రికలు పంపడం వరకు నయనతారనే చూసుకుంటుంది. జూన్ 9న విఘ్నేష్ శివన్ – నయనతార పెళ్లాడనున్నారు. బంధువులు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్ళికి రానున్నారు. ఇప్పటికే కొందరు అతిథులకు ‘డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డ్’ని పంపించారు ఈ జంట.
ప్రసుతం ఈ వీడియో ఇన్విటేషన్ వైరల్‌గా మారింది. ఈ పత్రిక ప్రకారం నయన–విఘ్నేష్ తమిళనాడులోని మహాబలిపురంలో పెళ్లాడనున్నారు. ఈ వెడ్డింగ్ వీడియో డిజైన్ చాలా బాగుంది అట. ఆకాశం, అందమైన ఇల్లు, చుట్టూ పచ్చని చెట్లతో ఈ వీడియోని డిజైన్ చేసారు. మొత్తానికి నయనతార పెళ్లికి సమయం దగ్గర పడింది అన్నమాట. గత వారం నయనతార జంట తంజావూరులోని పాపనాశంలో మేల్ మరతురు గ్రామంలో అమ్మవారు ఆలయాన్ని సందర్శించింది.
Also Read: Venkatesh And Roja: వెంకటేశ్ తో రోజా అందుకే మాట్లాడటం లేదా?
ఈ అమ్మవారు నయనతార కుల దైవం అట. చిన్నతనం నుంచి ఈ అమ్మ వారిని నయనతార పూజిస్తారు. అందుకే.. పెళ్లికి ముందు అమ్మవారి ఆశీస్సులు తీసుకుంది ఈ బ్యూటీ. ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించింది. అయితే, నయనాతర మాత్రం తన పెళ్లి వ్యవహారం పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.
తన పెళ్లి విషయంలో నయనతార ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నయనతారకు సంబరాలు చేసుకోవడం, పెద్దగా హడావిడి చేయడం లాంటివి ఇష్టం ఉండవు. అందుకే తన నిశ్చితార్థ వేడుకను కూడా చాలా సింపుల్ గా జరువుకుంది. పెళ్ళి కూడా అలాగే చేసుకుంటుందట.
పెళ్లి అయ్యిపోయాక, సింపుల్ గా మా పెళ్లి అయిపోయిందని చెబుతుందేమో. ఏది ఏమైనా లేడీ సూపర్ స్టార్ నయనతారకి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే ఆమె పెళ్లి ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది.
Also Read:Meera Jasmine: లేటు వయసులో సెగలు పుట్టిస్తున్న మీరా జాస్మిన్ !
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read More