Nani Dasara movie Story Leak : దసరా మూవీ పరిశ్రమలో భారీ బజ్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియన్ మూవీగా విడుదల చేస్తుండగా ఇతర భాషల్లో కూడా మంచి బిజినెస్ చేసినట్లు సమాచారం. ఈ చిత్ర హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్స్ పోటీపడుతున్నారట. హీరో నాని సైతం విజయం మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. దసరాతో బ్లాక్ బస్టర్ కొడుతున్నామని చెప్పకనే చెబుతున్నాడు. పుష్ప, కెజిఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో పోల్చుతున్నారు. ఇక ఓపెనింగ్స్ రాబట్టేందుకు విరివిగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే దసరా చిత్ర కథ ఇదే అంటూ ఓ క్రేజీ రూమర్ తెరపైకి వచ్చింది. దాని ప్రకారం… దసరా చిత్రం నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఆ పాత్రల మధ్య ఘర్షణ, భావోద్వేగాలే దసరా కథ. అవి హీరో, హీరోయిన్, విలన్, హీరో ఫ్రెండ్. ఈ నాలుగు పాత్రలు కథలో కీలకం అట. వీటి ఆధారంగానే దర్శకుడు కథ నడిపించారట. సాధారణంగా ప్రతి సినిమాలో హీరో, హీరోయిన్, విలన్ చుట్టే కథ నడుస్తుంది. దసరా మూవీలో మిత్రుడు క్యారెక్టర్ కూడా చాలా కీలకం అంటున్నారు. అసలు హీరోయిన్ కీర్తి సురేష్ ని వివాహం చేసుకునేది, నాని కాదట. అతని ఫ్రెండ్ అట.
వెన్నెల(హీరోయిన్) మీద కన్నేసిన విలన్ ఆమెను దక్కించుకోవాలని అనుకుంటాడు. అంగబలం, అర్థబలం, రాజకీయ పలుకుబడి ఉన్న విలన్ కి వెన్నెల విషయంలో ఈర్ష్యా ద్వేషాలకు గురవుతాడు. అతని ఇష్టానికి వ్యతిరేకంగా హీరో ఫ్రెండ్ వెన్నెలను పెళ్లి చేసుకుంటాడు. దాంతో అగ్గిమీద గుగ్గిలమైన విలన్ వెన్నెల భర్తను, హీరో నాని ఫ్రెండ్ ని చంపేస్తాడు. అది తెలిసి విలన్ మీద రివేంజ్ తీర్చుకోవాలని నాని అనుకుంటాడు. మిత్రుడిని చంపి, వెన్నెలను వెంటాడుతున్న విలన్ కి హీరో ఎలా బుద్ధి చెప్పాడనేదే కథ. స్నేహం, ప్రేమ, రాజకీయం, వర్గ విబేధాలు వంటి అంశాలు జోడించి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారట.
మరి వెన్నెలతో హీరో నానికి ఉన్న సంబంధం ఏమిటీ? వారి బంధం ఎలా ముగిసింది? అనేదే కథ అట. ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. మార్చి 30న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.