
Nani Dasara Movie: న్యాచురల్ స్టార్ నానీ హీరో గా నటించిన ‘దసరా’ మూవీ కోసం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తుంది. ఎందుకంటే సంక్రాంతి సినిమాలు తర్వాత సరైన బ్లాక్ బస్టర్ సినిమా కానీ,పెద్ద హీరో సినిమా కానీ రాలేదు.
ఈ మూడు నెలల్లో సంక్రాంతి బ్లాక్ బస్టర్స్ తర్వాత కేవలం బలగం అనే చిత్రం మాత్రమే కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన మూవీస్ అన్నీ ఎవరేజి గా ఆడాయి. అందుకే ఇప్పుడు ‘దసరా’ కోసం ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తూ ఉంది.ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి యూత్ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే ఈ సందర్బంగా ఈ మూవీ కి సంబంధించి ఒక చిన్న రివ్యూ మీకోసం అందిస్తున్నాము చూడండి.
ఈ సినిమా కదా ప్రేమ, స్నేహం మరియు పగ మధ్య తిరుగుతుంది అట. ఇందులో నానీ సింగరేణి కార్మికుడిగా, బొగ్గు దొంగ గా కనిపించబోతున్నాడు అట. తన స్నేహితుడు ని చంపిన విలన్ పై రివెంజ్ తీర్చుకునే కథ గా ఉంటుందట ఈ సినిమా. అంతే కాదు హీరో హీరోయిన్ మరియు హీరో స్నేహితుడి మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కూడా నడుస్తాది అట.

స్టోరీ రొటీన్ అయ్యినప్పటికీ కూడా ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అట. అంతే కాకుండా పాటలు కూడా అదిరిపోయాయి అట. మధ్యలో వచ్చే చిన్న చిన్న ట్విస్తులు సినిమాకి మెయిన్ హైలైట్ గా ఉంటుందట. ఇక న్యాచురల్ స్టార్ నానీ నటన ఆయన కెరీర్ లోనే బెస్ట్ గా నిలుస్తుందని టాక్. కీర్తి సురేష్ కి కూడా మహానటి తర్వాత అంతటి నటన కి స్కోప్ ఉన్న పాత్ర దక్కిందట.. ఇదంతా కేవలం సెన్సర్ రివ్యూ మాత్రమే. ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మరో మూడు రోజుల్లో తెలియనుంది.