
Manchu Lakshmi: మంచు బ్రదర్స్ మనోజ్, విష్ణుల మనస్పర్థలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. నిన్న మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. విష్ణు-మనోజ్ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం, ఆగ్రహం వ్యక్తం చేయడం ఆ వీడియోలో రికార్డు అయ్యాయి. విష్ణు ఓ వ్యకి మీదకు దూసుకు వస్తుండగా మనోజ్ ‘మా వాళ్ళ మీద ఇలానే దాడి చేస్తున్నాడు. సిట్యుయేషన్ ఇలా ఉంది’ అంటూ కామెంట్స్ చేశాడు. మోహన్ బాబు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన సారథి నివాసంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మనోజ్ స్వయంగా వీడియో షూట్ చేసి మరుసటి రోజు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
టాలీవుడ్ నిన్న మొత్తం ఇదే చర్చ జరిగింది. ఈ క్రమంలో అన్నదమ్ముల గొడవలకు కారణాలు ఇవే అంటూ పలు వాదనలు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో మనస్పర్థలు చోటు చేసుకున్నాయని కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ వివాదం మీద మోహన్ బాబు ఫైర్ అయ్యారు. మొదట మనోజ్ చేత ఆ వీడియో డిలీట్ చేయించారు. ఆయన ఇద్దరు కొడుకులకు చివాట్లు పెట్టినట్లు సమాచారం.
సాయంత్రానికి విష్ణు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది చాలా చిన్న విషయం. మనోజ్ వయసులో చిన్నవాడు. ఆవేశంలో వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చిన్న గొడవ. దీన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. సారథిని మనోజ్ ని అదుపు చేయలేదు.. అని చెప్పుకొచ్చారు. నేడు మంచు లక్ష్మి సైతం ఈ వివాదం మీద స్పందించారు. ఇది అన్నదమ్ముల మధ్య ఏర్పడిన చిన్న వివాదం. నిజమేంటో తెలియకుండా నిరాధార కథనాలు రాసి విషయం పెద్దది చేయవద్దు. మనోజ్-విష్ణు గొడవలు త్వరలోనే సద్దుమణుగుతాయి… అన్నారు.

కాగా గత ఐదారు నెలలుగా మంచు ఫ్యామిలీలో విబేధాలు అంటూ వార్తలు వస్తున్నాయి. ఓ సందర్భంలో మంచు లక్ష్మి ఈ వార్తలను ఖండించారు. అవన్నీ పుకార్లు మాత్రమే. మంచు ఫ్యామిలీలో ఎలాంటి సమస్యలు లేవు. మేమందరం బాగున్నామని చెప్పారు. ఆమె ఖండించిన నెలల వ్యవధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కొంత కాలంగా జరుగుతున్న ప్రచారంలో నిజం ఉందని తేలిపోయింది. కాగా మోహన్ బాబు, విష్ణు పట్టించుకోకపోతే మనోజ్ వివాహం మంచు లక్ష్మి తన నివాసంలో చేశారు.