
Nandamuri Balakrishna: బాలయ్య మైక్ ముందుకు వచ్చాడంటే సంచలనమే. ఆయన ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో… అర్థం కాదు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తిరేపుతున్నాయి. బాలయ్య ఎవరిని ఉద్దేశించి అన్నారో? అనే సందేహాలు కలుగుతున్నాయి. సుదీర్థ కెరీర్లో బాలకృష్ణ వ్యాపార ఉత్పత్తులకు ప్రచారం కల్పించింది లేదు. ఆయన తోటి నటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరించారు. చిరంజీవి అంతర్జాతీయ బేవరేజ్ సంస్థ థంబ్స్ అప్ ప్రచారకర్తగా గతంలో వ్యవహరించారు. అందులో పెస్టిసైడ్స్ వాడకం మోతాదుకు మించి ఉందని ఆరోపణలు రాగా… చిరంజీవి తప్పుకున్నారు.
ఇక నాగార్జున కళ్యాణ్ జ్యూయలర్స్ , ఘడీ డిటర్జెంట్, మాజా, ఉతయం పంచెలు వంటి ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉన్నారు. వెంకీ మామ మణపురం గోల్డ్, రామ్ రాజ్ కాటన్ తో పాటు కొన్ని బ్రాండ్స్ ప్రమోట్ చేస్తున్నారు.యాడ్లు చేయనని మడిగట్టుకు కూర్చున్న బాలయ్య ఇటీవల పంథా మార్చారు. మొదటిసారి ఆయన ఓ రియల్ ఎస్టేట్ సంస్థను ప్రమోట్ చేస్తూ యాడ్ చేశారు. తాజాగా వేగా అనే జ్యూయలరీ స్టోర్స్ చైన్స్ కి ప్రచారకర్తగా నియమితులయ్యారు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తో పాటు వేగా జ్యూయలరీ సంస్థ ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్నారు.
ఇందులో భాగంగా బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ విజయవాడలో వేగ జ్యూయలరీ కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ కోసం వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బాలకృష్ణ కృష్ణ ఏంటి? ఒక నగల దుకాణం లాంచ్ చేయడమేంటి? అని కొందరు అనుకోవచ్చు. లోకులు కాకులు, ఎన్నెన్నో అనుకుంటూ ఉంటారు. అవేమీ నేను పట్టించుకోను. నేను చేసిన ప్రతి పనిని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అభిమానుల కోసం మంచి చిత్రాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను అడుగుపెట్టిన ప్రతి రంగంలో సక్సెస్ అవుతున్నాను. రికార్డులు నమోదు చేస్తున్నాను… అని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

లోకులు కాకులు వాళ్ళ మాటలు పట్టించుకోనని… బాలయ్య చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటనే చర్చ మొదలైంది. ఇటీవల తారకరత్న పెదకర్మ కార్యక్రమంలో బాలయ్య ప్రవర్తన వివాదాస్పదమైంది. బాలయ్య అందరినీ పలకరిస్తూ లేచి నిల్చున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను మాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. కనీసం వాళ్ళ వైపు పలకరింపుగా చూడలేదు. ఈ వీడియో బయటకు రాగా బాలయ్య ఎన్టీఆర్ ని అవమానించాడంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఈ సంఘటనను ఉద్దేశించే బాలయ్య లోకులు కాకులు అనే మాటలు వాడారా అనే సందేహాలు కలుగుతున్నాయి.
