Namrata Shirodkar watching Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రోడ్డు మీదకు వస్తే ఇంకా ఏమైనా ఉందా? అభిమానులు మీద పడి పోతారు. ఆయనకు ఉన్న క్రేజ్ అలాంటిది మరీ. అందుకే మహేష్ పర్సనల్ పనులు అన్నీ కూడా ఆయన భార్య నమ్రత చేస్తుంటుంది. మహేష్ బాబు పాల్గొనకపోయే అన్ని కార్యక్రమాల్లో నమ్రతనే పాల్గొంటూ వస్తుంది.
Namrata Shirodkar
తాజాగా హైదరాబాద్ లో ‘సర్కారివారి పాట’ మూవీ స్పెషల్ షోలను వేశారు. ఈ క్రమంలోనే భ్రమరాంబ థియేటర్ లో సర్కారివారి పాట స్పెషల్ షోకు గెస్ట్ గా మహేష్ భార్య నమ్రత హాజరయ్యారు. ఈ సినిమాను థియేటర్లో అభిమానుల కోలాహలం మధ్య చూస్తూ ఆమె ఎంజాయ్ చేశారు.
ఎప్పుడూ ఇంట్లోనే భర్త మహేష్, పిల్లలతో కలిసి సినిమా చూసే నమ్రత తొలిసారి ఇలా థియేటర్ కు వచ్చి మహేష్ ఫ్యాన్స్ తో కలిసి చూసి వారి ఆనందాన్ని లైవ్ లో చూసి సంబురపడ్డారు. మహేష్ బాబు స్థానంలో ఈమె వచ్చి అలరించారు.
Namrata Shirodkar
సినిమాను ఇలా థియేటర్లో చూడడం ఇదే తొలిసారి అని.. మహేష్ ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని ఇవ్వడానికే వచ్చానని నమ్రత అన్నారు. సినిమా అద్భుతంగా వచ్చిందని.. మహేష్ బాబు మాస్ మసాలా యాక్టింగ్, డైలాగులు అద్భుతంగా పేలాయని ఆమె అన్నారు.
Also Read: Chiranjeevi – Prabhas- Mahesh: చిరు, ప్రభాస్, మహేష్ సినిమాల ఫ్లాప్ లకు.. సీఎం జగన్ కు ఏం సంబంధం?
రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న మహేష్ అభిమానులకు ఈ సినిమా ఒక విందు భోజనం లాంటిదని నమ్రత కామెంట్ చేశారు. ఇలాంటి వైల్ ఎక్స్ పీరియన్స్ ను తాను ఎప్పుడూ మిస్ కానంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి భర్త మహేష్ మూవీని ఇలా పబ్లిక్ గా చూసి తన కోరికను.. ఫ్యాన్స్ కోరికను తీర్చారు నమ్రత.
https://www.youtube.com/watch?v=xQDIR46qMpc