Namitha : ఎవరైనా తల్లి కాబోతున్నారంటే అప్పటివరకూ ఉన్న అలవాట్లు అన్ని మానేసి బుద్దిగా..చక్కగా మసులుకుంటారు. ఇన్నాళ్లు కురుచ దుస్తులు ధరించిన మహిళలు సంప్రదాయ చీరలోకి మారిపోతుంటారు. కడుపుతో ఉన్నప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. పుష్టికర ఆహారం తింటారు. అయితే ఇప్పుడు వీటన్నింటితోపాటు సెలబ్రెటీలు తాము గర్భంతో ఉన్న ‘బేబి బంప్ ’ ఫొటోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

ఇటీవల గర్భం దాల్చిన కాజల్ తను కడుపుతో నెలలు నిండిన ఫొటోలను బయటపెట్టి అందరినీ షాక్ కు గురిచేసింది. ఈమెకంటే ముందు కూడా పలువురు మహిళా సెలబ్రెటీలు, హీరోయిన్లు ఇలానే కడుపుతో ఉండగా తీసిన హాట్ ఫొటోలను పంచుకున్నారు. హీరోయిన్ అమీ జాక్సన్ అయితే కడుపుతో ఉండగానే హాట్ ఫొజులొచ్చి వార్తల్లో నిలిచింది.

తాజాగా అదే బాటలో తమిళ హీరోయిన్ నమిత నడిచింది. ముద్దుగా బొద్దుగా ఉండే ఈ అమ్మడు తమిళనాడులోనే సెటిల్ అయ్యింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘సొంతం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ‘జెమిని’, ఒక రాజు.. ఒక రాణి, ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి, ఐతే ఏంటి, నాయకుడు, బిల్లా, సింహా వంటి చిత్రాల్లో నటించింది.
Also Read: YSR Congress Alliance: పొత్తులపై మాట మార్చిన వైసీపీ

ఆ తర్వాత కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది. భారీగా బరువు పెరగడంతో ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో కోలీవుడ్ నటుడు వీరేంద్రచౌదరిని 2017లో పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చింది. పెళ్లి అయిన తర్వాత కూడా పలు సినిమాల్లో నటించింది.

తాజాగా ఇఫ్పుడు కడుపుతో ఉన్న ఫొటోలు షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. అసలే బరువుగా ఉన్న నమిత ఇలా గర్భిణిగా ఉన్న ఫొటోలను అందరికీ చూపించి మరింతగా షాక్ కు గురిచేసింది. ప్రెగ్నెంట్ అని తెలియజెప్పడానికి ఇలాంటి పనులు చేస్తావా? అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Also Read: Different Marriage In Nuvvalarevu: రెండేళ్లకోసారి పెళ్లి.. వరుడి మెడలో తాళి.. వింతైన పెళ్లి మనదగ్గరే
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
[…] Also Read:Namitha : ఆ ఫొటోలు షేర్ చేసిన నమిత .. చూసి అంత… […]
[…] Also Read: Namitha : ఆ ఫొటోలు షేర్ చేసిన నమిత .. చూసి అంత… […]