Kota Srinivasa Rao: సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుది ఉన్నదున్నట్టు మాట్లాడే స్వభావం. ఇది కచ్చితంగా అభినందించే అంశమే. కాకపోతే ఉన్న మాట అంటూ బూతులు మాట్లాడటం, లేనిపోని విమర్శలు చేయడం మంచి అనిపించుకోదు. అదేంటో తెలియదు గానీ, ఈ మధ్య కోట ప్రవర్తన, మాట్లాడుతున్న మాటల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. పెరిగిన వయసు రీత్యా ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారేమో.

మెగాస్టార్ చిరంజీవి పై కోట నెగిటివ్ కామెంట్స్ చేసి మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐతే, తాజాగా కోట శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో జూ. ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘‘ఈ తరం నటుల్లో నాకు నచ్చినటువంటి హీరో జూ. ఎన్టీఆర్. అతనికున్న పొటెన్షియాలిటీ ఎవరికీ లేదు.
Also Read: Sarkaru Vaari Paata: సర్కారివారి పాట వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
నిజానికి బన్నీ, మహేష్ బాబులు కూడా మంచి నటులే. కానీ, జూ. ఎన్టీఆర్ కు ఉన్న పొటెన్షియాలిటీ ఏ హీరోకి లేదు. డైలాగ్ డెలివరీ, డ్యాన్సులు జూ. ఎన్టీఆర్ అద్భుతంగా చేస్తాడు. రామ్ చరణ్.. చిరంజీవి అబ్బాయి అవడం వల్ల ఇంత పేరు వచ్చింది, అంతే కానీ అతనిలో నటుడిగా అంత పొటెన్షియాలిటీ నాకు కనిపించలేదు’ అంటూ కోట సంచలన కామెంట్స్ చేశాడు.
కోట గారు గత కొంతకాలంగా తనకు ఇష్టం లేని టాలీవుడ్ హీరోల పై సెటైర్లు వేస్తూ వాళ్ళను చులకన చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కోట గారి అసహనానికి కారణం.. వ్యక్తిగత జీవితంలోని కొన్ని ఆటుపోట్లే అని ఆయన గురించి తెలిసిన వాళ్లు ఆయన పై సానుభూతి చూపిస్తున్నారు.
కానీ ప్రతి ఇంటర్వ్యూలో కోట యాంకర్ అడగకుండానే.. ‘ ఇప్పటి హీరోలకు సాధన లేదు గాని, వాదన ఎక్కువైంది అంటూ అలాగే ‘హీరోలకు జ్ఞానం ఉండటం లేదు, వాళ్ళు విజ్ఞానం పెంచుకోవాలి’ అంటూ మాట్లాడటం కొంతమంది ఆయా హీరోల సన్నిహితులను బాధిస్తోంది. దర్శకుడు హరీష్ శంకర్ లాంటి వారు అయితే, డైరెక్ట్ గా కోటకు ఫోన్ చేసి.. బాబాయ్ మీరు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు అంటూ సూచనలు చేస్తున్నారు.

అయితే మరోపక్క కోట మాటలను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటి హీరోల్లో చాలామంది సినియర్ నటీనటులకు అసలు గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని.. అందుకే కోట గారు అలా మాట్లాడారు అని కొంతమంది కోట పాయింట్ ఆఫ్ వ్యూకి మద్దతు పలుకుతున్నారు. సరే ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. ఒకప్పుడు అంటే.. కోట సినిమా పరిశ్రమలోకి వచ్చిన రోజుల్లో అంటే చిత్ర పరిశ్రమ చాలా చిన్నది.
ప్రతి ఒక్కరూ మరొకరితో సన్నిహిత సంబంధాలు కొనసాగించేలా అప్పటి పరిస్థితులు ఉండేవి. కానీ, ఇప్పటి డిజిటల్ యుగంలో సినిమాకు పరిమితులు మారిపోయాయి. ఎవరైనా ఏదైనా చేసే ఈ లోకంలో గతంలో లాగా ఉండాలి అంటే కుదరదు కదా. కాబట్టి.. కోట వ్యక్తిగత అభిప్రాయాలు పబ్లిక్ గా చెప్పకపోవడమే మంచిది.
Also Read:Amala- Naga Chaitanya: నాగచైతన్య తల్లి పై అక్కినేని అమల కామెంట్స్ వైరల్