Homeట్రెండింగ్ న్యూస్Gujarat Woman: ఇదేం ధర్నా తల్లి.. నడిరోడ్డుపై నగ్నంగా మహిళ నిరసన..!

Gujarat Woman: ఇదేం ధర్నా తల్లి.. నడిరోడ్డుపై నగ్నంగా మహిళ నిరసన..!

Gujarat Woman: ప్రభుత్వాలపై, పాలకులపై నిరసనలు తెలుపడం ప్రజాస్వామ్యంలో సాధారణం. నిరసనలు భిన్న రూపాల్లో ఉంటాయి. కొందరు ధర్నాలు చేస్తే.. కొంతమంది ముట్టడి చేస్తారు. రాస్తారోకో.. నల్ల గుడ్డలతో నిరసన.. నీటిలో ముగిని నిరసన.. పశువులు, విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చి నిరసన తెలుపడం జరుగుతుంది. మహిళల నిరసన శాంతియుతంగానే ఉంటేంది. దీక్షలు, ధర్నాలతో తమ నిరసన తెలుపుతారు. అయితే గతంలో శ్రీరెడ్డి మా అసోసియేషన్‌లో తనకు సభ్యత్వం ఇవ్వడం లేదని అర్ధనగ్నంగా నిరసన తెలిపి సంచలనం సృష్టించింది. తాజాగా శ్రీరెడ్డి దారిలోనే ఓ యువతి నడి రడ్డుపై నగ్నంగా నిరసన తెలిపింది. ఈ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగింది.

పోలీసుల తీరుపై..
గుజరాత్‌కులోని రాజ్‌కోట్‌కు చెందిన పూజా చౌహాన్‌(22) గాంధీగ్రామ్‌ ప్రాంతానికి చెందిన ప్రతాప్‌సింహను మూడు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఆమె అత్తమామలు వరకట్నం కోసం వేధిస్తున్నారు. ఎనిమిది నెలల క్రితం ఆడపిల్ల పుట్టడంతో వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఐదు నెలల క్రితం ఇల్లు వదిలి బయటకి వచ్చి తన కూతురు అంజలితో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. భర్తతోపాటు అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అయితే పోలీసులు తన అత్తమామలను భర్తను అరెస్టు చేయడంలో విఫలం అయ్యారని తనను ఇబ్బంది పెట్టిన కుటుంబసభ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నడి రోడ్డుపై అర్ధనగ్నంగా దాదాపు గంట సేపు తిరుగుతూ నిరసన చేసింది.

దెబ్బకు దిగొచ్చిన పోలీసులు..
తనకు న్యాయం చేయకపోతే తన నిరసనను ఉధృè ం చేస్తానని పూజా తెలిపింది. అవసరమైతే పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో నగ్నంగా ప్రదర్శన చేస్తానని బెదిరించింది. దీంతో పోలీసులు బుధవారం ఆమె భర్త ప్రతాప్‌సింగ్‌ చౌహాన్, అత్తమామలను అరెస్టు చేశారు. అయితే పబ్లిక్‌ ప్లేస్‌లో అసభ్యకరంగా ప్రవర్తించిన పూజాపై చర్యలు తీసుకోవాలని కూడా ప్లాన్‌ చేస్తున్నామని రాజ్‌కోట్‌ పోలీసులు తెలిపారు. చర్య తీసుకునే ముందు ఆమె మానసిక స్థితిని పరిశీలిస్తామని చెప్పారు.

నెట్టింట వైరల్‌..
పూజ అర్ధనగ్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. పెళ్లి చేసుకుని కూతురు ఉన్న యువతి ఇలా నిరసన తెలుపడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. భర్త, అత్త, మామ ఎంత టార్చర్‌ పెట్టారో.. అందుకే ఇంతలా నిరసన తెలిపిందని కొందరు.. ప్రేమ పెళ్లి ఇలాగే ఉంటదని కొందరు.. మహిళలకు న్యాయం జరుగడం లేదని కొందరు. ప్రేమించినప్పుడు తెలియదా అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. నిరసన చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి.. ఇలా బట్టలు విప్పి తిరగటం ఏంటి అని నెటిజన్లు పూజాను విమర్శిస్తున్నారు.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular