Nagpur Man Pregnant: మహిళలు గర్భం దాల్చడం సహజం. స్త్రీ జీవిలో గర్భం దాల్చే శారీరక వ్యవస్థ ఉంటుంది. కానీ పురుషుల్లో ఉండవు. కానీ, ఇ్కడ ఓ విషయం వైద్యులనే షాక్‌కు గురిచేసింది. ఓ పురుషుడు తన కడుపులో 36 ఏళ్లుగా కవల పిండాలను మోశాడు. కడుపు అసహజంగా పెరగడంతో సదరు వ్యక్తి వైద్యులను సంప్రదించగా, వారే షాక్ అయ్యే విషయం వెలుగు చూసింది.
నాగపూర్ వ్యక్తి..
మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన సంజు భగత్ 19 ఏళ్లు వచ్చే వరకు అందరిలానే ఉన్నాడు. 20 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి అతనికి కష్టాలు మొదలయ్యాయి. అతడి కడుపు రోజురోజుకు అసహజంగా పెరగడం మొదలైంది. కొన్ని నెలలకే గర్భం వచ్చినట్లుగా మారిపోయింది. దీంతో అతడ్ని అందరూ ‘గర్భవతి సంజు’ అని గేలి చేసేవారు. అయితే భగత్ మొదట్లో తన పొట్ట గురించి అతడు పట్టించుకోలేదు. సంవత్సరాలు గడిచే కొద్దీ అతడిలో కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో 36 ఏళ్ల తర్వాత అతడు వైద్యులను సంప్రదించాడు.
ట్యూమర్ ఉందని…
భగత్‌కు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అతడి కడుపులో ట్యూమర్ ఉందని భావించారు. ఆపరేషన్ చేసి ట్యూమర్ తీయటానికి సన్నాహాలు చేశారు. అయితే, ఆపరేషన్ చేస్తున్న సమయంలో డాక్టర్లకు షాకింగ్ విషయం తెలిసింది. అతడి కడుపులో ఉన్నది ట్యూమర్ కాదని, ఓ మనిషి అని తెలిసి నోరెళ్ల బెట్టారు. దీనిపై సంజుకు ఆపరేషన్ చేసిన డాక్టర్ మెహతా మాట్లాడుతూ.. ‘‘ అతడి కడుపులో చాలా ఎముకలు ఉన్నాయి. మొదట ఓ కాలు బయటకు వచ్చింది. తర్వాత మరో కాలు. తర్వాత ఒక్కో భాగం బయటకు వచ్చాయి. మేము భయపడ్డాం. ఇలా ఓ వ్యక్తి కడుపులో మరో వ్యక్తి పెరగటాన్ని ‘పీటస్ ఇన్ పీటు’ అంటారు. ఇదో అత్యంత అరుదైన కండీషన్. బయటకు తీసేటప్పుడే కడుపులోని భాగాలు కోసేయాల్ని వచ్చింది’ అని తెలిపారు. సంజు తన కడుపులోంచి బయటకు తీసిన తన ట్విన్‌ను చూడటానికి ఇష్టపడలేదు. బయటకు తీసిన అవయవాలను పడేశారు. సంజు తన పాత రోజుల్ని మరిచిపోయి సంతోషంగా జీవిస్తున్నాడు.