Bigg Boss 6 Telugu : ఇనాయని కొట్టినందుకు రేవంత్ కి ‘యెల్లో కార్డు’ ఇచ్చిన నాగార్జున..ఈసారి డైరెక్ట్ ఎలిమినేషన్ అంటూ వార్నింగ్

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్-6 ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ఎంత హీట్ వాతావరణంలో జరిగిందో మన అందరం చూసాము..చాలా మంది కంటెస్టెంట్స్ హద్దులు దాటిమారి ప్రవర్తించారు..వారిలో రేవంత్ గురించి మనం ముందుగా మాట్లాడుకోవాలి..ఇతగాడు టాస్కు వచ్చిందంటే చాలు ఎలా రెచ్చిపోతాడో మన అందరికి మొదటి రోజు నుండే తెలుసు..ఎలా అయినా గెలవాలనే తపనతో ఒక్కోసారి తానూ మనిషిని అనే విషయం కూడా మర్చిపోతుంటాడు. ఈ వారం అయితే అతని నోటిని మరియు […]

Written By: NARESH, Updated On : November 5, 2022 10:09 pm
Follow us on

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్-6 ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ఎంత హీట్ వాతావరణంలో జరిగిందో మన అందరం చూసాము..చాలా మంది కంటెస్టెంట్స్ హద్దులు దాటిమారి ప్రవర్తించారు..వారిలో రేవంత్ గురించి మనం ముందుగా మాట్లాడుకోవాలి..ఇతగాడు టాస్కు వచ్చిందంటే చాలు ఎలా రెచ్చిపోతాడో మన అందరికి మొదటి రోజు నుండే తెలుసు..ఎలా అయినా గెలవాలనే తపనతో ఒక్కోసారి తానూ మనిషిని అనే విషయం కూడా మర్చిపోతుంటాడు.

ఈ వారం అయితే అతని నోటిని మరియు చేతులను ఎవ్వరు అదుపు చేయలేకపోయారు..చూసే వారికి చాలా వరస్ట్ గా అనిపించింది..ముఖ్యంగా ‘మిషన్ పాజిబుల్’ టాస్కులో భాగంగా టీ షర్ట్ మీదున్న లైఫ్ స్ట్రిప్స్ ని తొలగించే క్రమం లో ఇనాయ ని ఉద్దేశపూర్వకంగా కొట్టాడు..దీనిపై నాగార్జున గారు చాలా తీవ్రంగా స్పందించాడు..ఆయన రేవంత్ కి వార్నింగ్ ఇస్తున్న ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

ఇనాయ ని రేవంత్ కొట్టిన వీడియో నాగార్జున చూపిస్తూ ‘ఈ పని చేసినందుకు గాను నీకు యెల్లో కార్డు ఇస్తున్నాను..ఈసారి నా చేత రెడ్ కార్డు ఇచ్చేలా చేసుకోకు’ అని వార్నింగ్ ఇస్తాడు నాగార్జున..యెల్లో కార్డు అంటే లాస్ట్ వార్నింగ్ లెక్క అన్నమాట..మరోసారి అలాంటి ప్రవర్తన హౌస్ మేట్స్ పట్ల చూపిస్తే ‘రెడ్ కార్డు’ ఇచ్చి డైరెక్ట్ గా ఎలిమినేట్ చేస్తారు..రేవంత్ ఇప్పుడు అంత డేంజర్ పొజిషన్ లో ఉన్నాడు..రేవంత్ ప్రస్తుతం ఉన్న హౌస్ మేట్స్ అందరిలో వోటింగ్ పరంగా టాప్ 1 ర్యాంకు లో కొనసాగుతున్నాడు.

కానీ ఈ వారం తన ఆట తీరుకి ప్రేక్షకులు కాస్త నిరాశకి గురైయ్యారు..ముందు వారాలతో పోలిస్తే ఈ వారం అతని వోటింగ్ శాతం కాస్త తగ్గింది..నాగార్జున ఎన్ని సార్లు చెప్పిన తన ప్రవర్తనని ఏ మాత్రం మార్చుకోలేకపోయాడు రేవంత్..మరోసారి అదే తప్పు చేస్తే మాత్రం ఆయన డైరెక్ట్ ఎలిమినేషన్ అని తెలిసిపోయింది..మరి రేవంత్ ఇప్పటికైనా తనని తానూ కంట్రోల్ చేసుకుంటాడా..లేకపోతే రెడ్ కార్డు రప్పించుకొని ఎలిమినేట్ అవుతాడా అనేది చూడాలి.