https://oktelugu.com/

‘ఆరెంజ్’ దెబ్బకు అన్నయ్య నాగబాబు ఆస్తులు అమ్ముకున్నాడు.. పవన్ భావోద్వేగం

హైదరాబాద్ వరద బాధితులకు సినీ సెలబ్రెటీలు తమవంతు సాయం ప్రకటించి అండగా నిలుస్తున్నారు. ఎవరికీతగ్గ స్థాయిలో వారు విరాళాలు అందిస్తున్నారు. భారీ మొత్తంలో విరాళాలు ఇస్తున్న కొందరు ఏమాత్రం సరిపోవడం లేదని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించాడు. Also Read: ‘ఆకాశం నీ హద్దురా’ సడెన్ వాయిదా వెనుక కారణమెంటీ? దేశంలో, రాష్ట్రంలో ఎలాంటి విపత్తులు వచ్చిన అందరి దృష్టి సినిమా స్టార్స్ పైనే ఉంటుందని […]

Written By:
  • NARESH
  • , Updated On : October 23, 2020 / 10:29 AM IST
    Follow us on

    హైదరాబాద్ వరద బాధితులకు సినీ సెలబ్రెటీలు తమవంతు సాయం ప్రకటించి అండగా నిలుస్తున్నారు. ఎవరికీతగ్గ స్థాయిలో వారు విరాళాలు అందిస్తున్నారు. భారీ మొత్తంలో విరాళాలు ఇస్తున్న కొందరు ఏమాత్రం సరిపోవడం లేదని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించాడు.

    Also Read: ‘ఆకాశం నీ హద్దురా’ సడెన్ వాయిదా వెనుక కారణమెంటీ?

    దేశంలో, రాష్ట్రంలో ఎలాంటి విపత్తులు వచ్చిన అందరి దృష్టి సినిమా స్టార్స్ పైనే ఉంటుందని పవన్ తెలిపాడు. వరదలు వచ్చినా.. భూకంపాలు వచ్చినా.. ఏదైనా విపత్తులు సంభవించిన ప్రతీసారి సినిమావాళ్లు.. వ్యాపారవేత్తల విరాళాలు ఇస్తూ ముందుంటారని ఆయన గుర్తుచేశాడు. అయితే ప్రభుత్వాలు వీరి విరాళాల కోసం ఎదురు చూడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు.

    రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో గెలిచేందుకు వేలకోట్లు ఖర్చుపెడుతుంటారని పవన్ అన్నారు. అలాంటి వాళ్లు ప్రకృతి విపత్తుల సమయంలో ముందుకొస్తే ప్రజలకు చేయూతనందిస్తే బాగుంటుందన్నారు. నాయకులు ఎలక్షన్స్ కోసం ఖర్చుపెట్టే డబ్బును ఇలాంటి సమయంలో వినియోగిస్తే బాగుంటుందని తన అభిప్రాయం పవన్ కల్యాణ్ వ్యక్తం చేశారు.

    స్టార్స్ అందించే విరాళాలపై పలువురు విమర్శలు చేస్తున్నారని.. అయితే అలా విమర్శించే వాళ్లు జేబులోంచి పది రూపాయలైనా సాయం చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీలో కోటి రూపాయాలు సంపాదిస్తే 40లక్షలు ట్యాక్సుల రూపంలో పోతున్నాయని.. నిర్మాత చేతికి రూ.60లక్షల లోపు మాత్రమే వస్తుందని తెలిపారు. ఒకవేళ సినిమా ప్లాప్ అయితే అది కూడా రాకపోవచ్చని తెలిపారు.

    సినిమా ఫెయిల్ అయితే ఒక్కోసారి ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. ఆరెంజ్ సినిమా నష్టపోయినప్పుడు తన అన్నయ్య నాగబాబుకు ఇదే పరిస్థితి ఎదురైందన్నాడు. అప్పుడు మేము తలోచేయి వేసి బయటికి తీసికొచ్చినట్లు తెలిపారు. అలాగే ‘అత్తారింటికిదారేది’ మూవీ లీక్ అయినపుడు సినిమా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదని.. తాను హామీ పత్రాలిచ్చాకే సినిమా థియేటర్లలో రిలీజైందని గుర్తు చేశాడు.

    నిజానికి లాక్డౌన్ వల్ల సినిమా ఇండస్ట్రీ చాలా దెబ్బతిందని పవన్ తెలిపాడు. అయినప్పటికీ చాలామంది సెలబ్రెటీలు భారీగా విరాళాలు అందించారని తెలిపారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ 25కోట్లు ఇవ్వగా.. తాను కోటి రూపాయలు ఇచ్చారని తెలిపారు. ఎవరిస్థాయి వారిదని.. కష్టపడి సంపాదించేవాడికి రూ.10లక్షలు ఇవ్వాలంటే మనస్సు వస్తుందా? అని ప్రశ్నించాడు.

    Also Read: చిరు మళ్లీ పుట్టాడు.. మగబిడ్డకు జన్మినిచ్చిన మేఘనారాజ్..!

    ఎవరి స్థోమత మేరకు వారు సాయం చేస్తారని.. ఈ విషయంలో మీరెందుకు సాయం చేయలేదని అడిగి హక్కు ఎవరికీ లేదని పవన్ స్పష్టం చేశాడు. సినిమా ఇండస్ట్రీలో లాభాలు ఏమేరకు ఉంటాయో నష్టాలు కూడా అలాగే ఉంటాయని తెలిపాడు. ఇది నమ్మకం లేని ప్రపంచమని.. రేపటి గురించి ఆలోచించే వారే ఇండస్ట్రీలో కొన్నాళ్లపాటు సేఫ్ గా ఉంటారని పవన్ తెలిపాడు. ఇకనైనా సెలబ్రెటీల విరాళాలను తప్పుబట్టే నెటిజన్లు తమ పద్ధతి మార్చుకుంటారో లేదో వేచిచూడాల్సిందే..!