
Pawan Kalyan- Nagababu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న హైదరాబాద్ శిల్ప కళా వేదిక లో ఒక ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మరియు మెగా ఫ్యాన్స్ తో పాటుగా నాగ బాబు మరియు ఇండస్ట్రీ కి చెందిన కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. రామ్ చరణ్ సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ, చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి నేడు ఆయన కూడా సాధించలేని ఎన్నో ఘనతలను సాధించిన రామ్ చరణ్ గురించి, చిన్నప్పటి నుండి ఆయనతో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు.
అయితే ఈ ఈవెంట్ లో మెగా బ్రదర్ నాగ బాబు మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.మెగా ఫ్యామిలీ లో హీరోలందరినీ కలుపుతూనే అల్లు అర్జున్ ని మిస్ చెయ్యడం చర్చనీయాంశం గా మారింది.

ఆయన స్పీచ్ లోని కొన్ని ముఖ్య అంశాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.. ఆయన మాట్లాడుతూ ‘ఇక్కడకి వచ్చిన చిరంజీవి ఫ్యాన్స్ కి , రామ్ చరణ్ ఫ్యాన్స్ కి , వరుణ్ తేజ్ ఫ్యాన్స్ కి , సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ కి, అందరికంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫెయిన్స్ కి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ ప్రారంభించాడు. ఇక్కడ నాగబాబు అందరికంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనడమే పెద్ద కాంట్రవర్సీ కి తెరలేపింది.అందరికంటే అంటే చిరంజీవి కంటే కూడా ఎక్కువ అనే అర్థం వస్తుంది.
అంటే చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువనా అనే విధంగా దీనిని ఫ్యాన్స్ తీసుకున్నారు. ఎప్పుడైతే నాగబాబు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తాడో, అప్పుడు ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోయింది. దీనిని బట్టీ అక్కడికి ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చారు కాబట్టి , వాళ్ళ కోసం నాగబాబు అలా మాట్లాడాడు అంటున్నారు కొంతమంది అభిమానులు.