https://oktelugu.com/

Samantha Nagachaitanya : సమంత ఆరోగ్యం నేపథ్యంలో నాగ చైతన్య కీలక నిర్ణయం… ఆమె దక్షిణ కొరియా నుండి రాగానే!

Samantha Nagachaitanya : మనుషులన్నాక మనస్పర్థలు వస్తాయి. ఎంత గొప్ప ప్రేమికులైనా… చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. అంత మాత్రాన శాశ్వతంగా దూరం అవుతారా?. సమంత-నాగ చైతన్యల విషయంలో అదే జరుగనుంది అంటున్నారు. నాగ చైతన్య మాజీ భార్య సమంతను కలవనున్నారనే వార్త టాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించారు. అలాగే యశోద మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత […]

Written By:
  • NARESH
  • , Updated On : December 8, 2022 / 08:24 PM IST
    Follow us on

    Samantha Nagachaitanya : మనుషులన్నాక మనస్పర్థలు వస్తాయి. ఎంత గొప్ప ప్రేమికులైనా… చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. అంత మాత్రాన శాశ్వతంగా దూరం అవుతారా?. సమంత-నాగ చైతన్యల విషయంలో అదే జరుగనుంది అంటున్నారు. నాగ చైతన్య మాజీ భార్య సమంతను కలవనున్నారనే వార్త టాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించారు. అలాగే యశోద మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత మరింత స్పష్టత ఇచ్చారు.

     

    మయోసైటిస్ తో నేను పోరాడుతున్నాను. నేను మరింత బలమైన యుద్ధం చేయాల్సి ఉంది. అయితే పత్రికలు రాసినట్లు ప్రాణాంతకం కాదు. నేను చనిపోలేదు. బ్రతికే ఉన్నాను. అదే సమయంలో సమస్య చిన్నది కూడా కాదంటూ చెప్పుకొచ్చారు. సమంత మయోసైటిస్ స్టేజ్ త్రీకి చికిత్స తీసుకుంటున్నారు. ఈ మహమ్మారి నుండి బయటపడేందుకు సమంత మెరుగైన వైద్యం తీసుకోవాలి అనుకుంటున్నారు.

    ప్రస్తుతం చికిత్స అందిస్తున్న వైద్యులు ఈ వ్యాధికి దక్షిణ కొరియాలో బెటర్ ట్రీట్మెంట్ ఉందని సలహా ఇచ్చారట. వారి సలహా మేరకు సమంత దక్షిణాఫ్రికాలో వెళ్లినట్లు సన్నిహిత వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. త్వరలో సమంత తిరిగి ఇండియా రానున్నారు. సమంత హైదరాబాద్ వచ్చాక నాగ చైతన్య ఆమెను నేరుగా కలవనున్నారట. సమంతను పరామర్శించి హెల్త్ గురించి వాకబు చేస్తారట. నాగ చైతన్య సన్నిహితులు ఈ మేరకు ఆయన్ని కన్విన్స్ చేశారట. భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న సమంతను ఇగోలు పక్కన పెట్టి కలవాలని నచ్చజెప్పారట.

    ఈ క్రమంలో సమంతను త్వరలో నాగ చైతన్య కలవడం ఖాయం అంటున్నారు. అదే సమయంలో కొందరు ఈ వార్తలను ఖండిస్తున్నారు. నాగ చైతన్యకు ఇకపై సమంతను కలిసే ఆలోచన లేదు. వారు తీవ్ర మనస్పర్ధలతో విడిపోయారు. మళ్ళీ కలవడం వలన కొత్త సమస్యలు తలెత్తడమే కానీ సమంత-నాగ చైతన్యలకు ఎలాంటి ఉపశమం కలగదు అంటున్నారు. ప్రచారంలో ఉన్న ఈ రెండు వాదనలపై స్పష్టత రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. నాగ చైతన్య-సమంత అధికారికంగా విడిపోయి ఏడాది అవుతుంది. 2021 అక్టోబర్ లో విడాకుల ప్రకటన చేశారు.