Naa Anveshana Youtuber: టెక్నాలజీ రోజు రోజుకు అభివృద్ది చెందుతూ అనేక ఆవిష్కరణలకు వేదికవుతోంది. స్మార్ట్ ఫోన్ చేతికి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంటర్నెట్ వినియోగంతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. అందరికంటే కాస్త భిన్నంగా ఆలోచించేవారు, క్రియేటివిటీ ఉన్న వారు యూట్యూబ్ చానల్ క్రియేట్ చేసుకుని ఆదాయాన్ని సృష్టించుకుంటున్నారు. యూట్యూబ్ ను ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. విభిన్నమైన కంటెంట్ తో వీడియోలు చేస్తూ దానికి క్రియేటివిటీ జోడించి మిలియన్లకొద్ది వ్యూస్‌ను రాబడుతున్నారు. దీంతో యూట్యూబ్… లక్షల మందికి ఆదాయమార్గంగా మారింది. తమ టాలెంట్‌ను బయటపెట్టుకునే, నలుగురితో పంచుకునే మీడియా వేదిక యూట్యూబ్. వివిధ పేర్లతో సొంత చానెళ్లు పెట్టుకుని ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఇలాగే ఉత్తరాధ్రవాసి ఏకంగా యూట్యూబ్ స్టార్ అయ్యాడు. ‘నా అన్వేషణ’ పేరుతో యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి ప్రపంచం మొత్తం చుట్టేస్తూ నెంబర్ వన్ యూట్యూబర్‌గా హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు ఉత్తరాంధ్రవాసి అవినాష్. మిలియన్ల వ్యూస్‌తో లక్షల్లో ఆదాయం సంపాదిస్తూ తనకు తానే సాటిగి నిలిచాడు.
ప్రపంచ యాత్రీకుడిగా..
ప్రపంచ యాత్రికుడిగా పేరొందిన యూట్యూబర్ అవినాష్ ప్రపంచ దేశాలను చుట్టేస్తూ మంచి మంచి వీడియోలు చేస్తూ నెంబర్ వన్ యూట్యూబర్‌గా చరిత్ర సృష్టిస్తున్నాడు. లక్షల్లో ఆదాయం ఆర్జిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ‘నా అన్వేషణ’ పేరుతో యూట్యూబ్ చానల్ క్రియేట్ చేసుకుని ప్రపంచ దేశాలను తిరగేస్తున్నాడు. తాజాగా నెల రోజులకు సంబంధించిన యూట్యూబ్ నుంచి వచ్చిన ఆదాయాన్ని తెలిపి షాక్ ఇచ్చాడు. ఏకంగా రూ.30 లక్షలు పొందినట్లు వీడియోలో అవినాష్ స్పష్టం చేశాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
శోధించు.. సాధించు అన్నట్లుగా..
ఏదీ తనంత తానై నీ దరికి రాదన్నాడు శ్రీశ్రీ.. దీనిని నమ్మిన అవినాష్.. శోధించి సాధిస్తున్నాడు. ప్రపంచ దేశాలను చుట్టేస్తూ డిఫరెంట్ కంటెంట్‌తో వీడియోలు చేస్తూ లక్షల్లో వ్యూస్ పొందుతున్నాడు. రోజుకో వీడియో చేసి యూట్యూబ్‌లో అప్ లోడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. తను అనుకున్నట్లుగానే క్రియేటివ్ కంటెంట్‌తో వీడియోలు రూపొందించి యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తాడు. ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నాడు. ఈ సందర్భంగా నెల రోజుల వ్యవధిలో రూ. 30 లక్షల ఆదాయం వచ్చినట్లు తన యూట్యూబ్ చానల్ ద్వారా వెల్లడించాడు.
అంత ఈజీ కాదు..
ఈ రోజుల్లో ఓ యూట్యూబ్ చానల్ కు అంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఆశామాశి వ్యవహారం కాదు. దాని వెనకాల యూట్యూబర్ అవినాష్ కృషి ఎంతో ఉంది. యూట్యూబ్ చానల్ ప్రారంభించిన కొత్తలో అంతంతే ఆదాయం వచ్చిందని చెప్పిన ఆయన ఎన్నో ఒడిదుడుకుల తర్వాత లక్షల్లో ఆదాయం సంపాదిస్తు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. యూట్యూబర్లుగా తెలుగులో చాలామందే ఫేమస్ అయ్యారు. కానీ అవినాష్ వారందరికంటే భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని సక్సెస్ అయ్యాడు. లక్షల్లో ఆదాయం సంపాదిస్తూ నంబర్ వన్ తెలగు యూట్యూబర్‌గా నిరానేకడ సృష్టించాడు.