
Nayanthara: సినిమా నటుల క్రేజ్ ను భట్టి వారి రెమ్యూనరేషన్ ఉంటుంది. సాధారణంగా మిగతా వారి కంటే హీరోలు ఎక్కువ పారితోషికం తీసుకుంటారు. కానీ ఈమధ్య హీరోయిన్లకు డిమాండ్ పెరుగుతోంది. అంద చందాలతో పాటు నటనలోనూ పోటీ పడుతుండడంతో హీరోలతో సమానంగా డబ్బును తీసుకుంటున్నారు. తాజాగా ఓ సీన్ కోసం నయనతార ఏకంగా రూ.10 కోట్ల డిమాండ్ చేసిందట. నయనతార ఇటీవలే విగ్నేష్ అనే డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో ట్రెండీగా మారారు. ఇదే సమయంలో ఆమె ఓ సీన్ కోసం ఇంత డిమాండ్ చేయడమేంటి? అన్న చర్చ సాగుతోంది. ఇంతకీ ఆమె డిమాండ్ చేసే సీన్ ఏంటి?
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ జయాపజయాలతో సంబంధాలు లేకుండా సినిమాలు తీస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘పఠాన్’ ఆశించినంత విజయం సాధించకపోయినా కమర్షియల్ గా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా షారుఖ్ ‘జవాన్’ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇందులో సౌత్ హీరోయిన్ నయనతారను ఎంపిక చేశారు. షారుఖ్ ఖాన్, నయనతారలు నటించడం ఇదే మొదటిసారి. నార్త హీరో, సౌత్ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తే సినిమా వర్కౌటవుతుందని డైరెక్టర్ అట్లీ భావిస్తున్నాడు. అందుకే ఈమూవీని పాన్ ఇండియా లెవల్లోతెరకెక్కిస్తున్నాడు.

ఈ సందర్భంగా నయన తారను ఓ సీన్ చేయమని డైరెక్టర్ అడిగాడట. ఆదేంటంటే తాను ఓ సీన్ లో బికినీలో కనిపించాలని డైరెక్టర్ కోరాడట. రెండు నిమిషాల పాటు బికినీలో కనిపించడానికి తనకేం ఇబ్బంది లేదని, కాకపోతే రూ.10 కోట్లు అవుతుందని చెప్పిందట. నయన్ చేసిన డిమాండ్ కు మేకర్స్ అస్సలు వెనుకాడలేదట. ఓన్లీ బికినీ కోసం నయన్ ఇంత డిమాండ్ చేసినా వాళ్లు ఒప్పుకోవడంతో అమ్మడుకు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుందని అంటున్నారు.
నయన్ ఇప్పటి వరకు కొన్ని సినిమాల్లో బికినీలో కనిపించారు. కానీ అప్పుడు పెళ్లి కాలేదు. కానీ ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నా బికినీ షో చేయడానికి సిద్ధమవుతుందట. మరి భర్త విగ్నేష్ కు ఈ విషయం తెలుసో? లేదో? అని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా నయన్ కుందనపు బొమ్మలా ఉంటుంది కాబట్టి ఎంత డిమాండ్ చేసినా మేకర్స్ వెనుకాడలేదని ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది.