
Allu Arjun Multiplex: మన టాలీవుడ్ నుండి పాన్ ఇండియా లో ఒక రేంజ్ క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతి తక్కువ మంది హీరోలలో అల్లు అర్జున్ ఒకడు.ముందు నుండే పాన్ ఇండియా లెవెల్ ఇతర రాష్ట్రాలలో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న అల్లు అర్జున్, పుష్ప సినిమాతో మరో లెవెల్ కి వెళ్ళిపోయాడు.ఇప్పుడు టాలీవుడ్ నుండి రాజమౌళి బ్రాండ్ తర్వాత అల్లు అర్జున్ బ్రాండ్ ఇతర రాష్ట్రాలలో చాలా పెద్దది.
ప్రస్తుతం ఆయన హీరో గా నటిస్తున్న పుష్ప – 2 సినిమా కోసం పాన్ వరల్డ్ స్థాయిలో ఉన్న సినీ ప్రేక్షకులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.సినిమాల్లో ఈ రేంజ్ ని అనుభవిస్తున్న అల్లు అర్జున్, వ్యాపార రంగం లో కూడా అదే రేంజ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు.ఇటీవలే అల్లు స్టూడియోస్ ని నిర్మించిన అల్లు అర్జున్ ,హైదరాబాద్ లోని అమీర్ పెట్ లాంటి బిజీ ప్రాంతం లో సత్యం థియేటర్ స్థానం లో ఒక మల్టీప్లెక్స్ ని నిర్మించాడు.
అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఈ మల్టీప్లెక్స్ యొక్క ప్రత్యేకతలను ఇప్పుడు మనం చూడబోతున్నాము.హైదరాబాద్ లో అల్లు అర్జున్ కంటే ముందే మహేష్ బాబు గాచి బౌలి ప్రాంతం లో AMB సినిమాస్ అని ఒక మల్టీప్లెక్స్ ప్రారంభించాడు.దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది.AMB లో ఏఎం లాంజ్ అని పెట్టినట్టుగానే ఇక్కడ కూడా ఏఏ లాంజ్ ని ఏర్పాటు చేశారట.అయితే ఇది కేవలం సిట్టింగ్ ఏరియా గా మాత్రమే కాకుండా గేమింగ్ జోన్ గా కూడా ఉండబోతుందట.ఇక అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ప్రొడక్ట్స్ కి సంబంధించి షో రూమ్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులోకి ఉంటుందట.

అంతే కాదు భారీ ఖర్చు తో అల్లు అర్జున్ విర్చువల్ ఇమేజి ని కూడా ఏర్పాటు చేశారట.ఈ ఇమేజి ముందు నిల్చొని ఎవరు ఎలా చేస్తే, ఆ ఇమేజి దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవుతుందట.ఇక ఈ మల్టీప్లెక్స్ లో 5 స్క్రీన్స్ ఉంటాయట.ఈ స్క్రీన్స్ అన్ని ‘ఒనిక్స్ సినిమా LED ‘ టెక్నాలజీ తో తయారు చేసినవి అట.ఈ స్క్రీన్స్ లో ఒక సినిమా చూస్తే వచ్చే అనుభవం అద్భుతంగా ఉంటుందని తెలుస్తుంది.మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మల్టీప్లెక్స్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.