
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ స్కేల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది.పవన్ కళ్యాణ్ లేని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు.ఇప్పటికే 75 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా అతి త్వరలోనే మొత్తం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా ఉన్నది.
మొఘల్ కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా కనిపించబోతున్నాడు.ఇప్పటికీ ఈ చిత్రానికి సంబంధించిన రెండు గ్లిమ్స్ వీడియోస్ ని విడుదల చెయ్యగా వాటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.త్వరలోనే టీజర్ ని కూడా విడుదల చెయ్యబోతున్నారు.దసరా కానుకగా ఈ చిత్రాన్ని అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదల చెయ్యడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.అదేమిటంటే కథరీత్యా ఈ సినిమాలో మరో హీరో ముఖ్య పాత్ర పోషించే స్కోప్ ఉందట.ఇటీవలే ఆ యువ హీరో ని కలిసి డేట్స్ అడగగా అతను చాలా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తున్నది.ఆ యువ హీరో మరెవరో కాదు, తమిళం లో వరుస విజయాలతో దూసుకుపోతూ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న శివ కార్తికేయన్ అట.

ఇతను పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ కూడా.ఈ నెల 24 వ తేదీన ప్రారంభం అవ్వబొయ్యే సరికొత్త షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి ఆ యువ హీరో సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడట.ఇప్పటికే ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ హీరో బాబీ డియోల్ నటిస్తున్నాడు.ఇప్పుడు తమిళ స్టార్ హీరో కూడా తోడై వీరమల్లు కి మరింత బలం చేకూర్చారు.