Music Director Thaman: దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ వారిసు. జనవరి 11న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఈ సినిమాను అభిమానుల సమక్షంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, దిల్ రాజు చూశారు. మూవీకి వచ్చిన స్పందన చూసిన థమన్ థియేటర్ నుండి బయటకు వచ్చాక కన్నీరు పెట్టుకున్నారు. థమన్ ఎమోషనల్ కావడంతో పక్కనే ఉన్న వంశీ పైడిపల్లి సముదాయించారు. థమన్ మరింత ఎమోషనల్ అవుతుండగా ఓదార్చారు. ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ విజయానికి మీరు అర్హుడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వారిసు చిత్రానికి అద్భుతమైన సంగీతం ఇచ్చారని ప్రశంసిస్తున్నారు.

కాగా నేడు తమిళ్ వెర్షన్ మాత్రమే విడుదలైంది. మొదట దిల్ రాజు తెలుగు, తమిళ్ వర్షన్స్ రెండూ జనవరి 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన మరలా తగ్గడం జరిగింది. టాలీవుడ్ పెద్దల ఒత్తిడితో వారసుడు చిత్రాన్ని జనవరి 14కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇక వారసుడు చిత్రానికి మిక్స్డ్ టాక్ దక్కింది. ఇది దిల్ రాజును కంగారు పెట్టే అంశం. సినిమా అంతగా బాగోలేదని తెలిశాక తెలుగు ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు.
వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే వారసుడు తీవ్రంగా నష్టపోతుంది. తమిళ్ లో బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే తెలుగు ఆడియన్స్ ఆసక్తి చూపిస్తారు. ఈ మూడు రోజుల్లో వారిసు చిత్ర కథ, సినిమా గురించి చాలా విషయాలు బయటకు వచ్చేస్తాయి. సోషల్ మీడియా యుగంలో భాషా బేధాలు లేకుండా అన్ని విషయాలు ప్రతి చోటకు క్షణాల్లో చేరిపోతున్నాయి. రెండు భిన్నమైన తేదీల్లో వారిసు, వారసుడు విడుదల చేయాలని నిర్ణయం తీసుకొని దిల్ రాజు తప్పు చేశాడనిపిస్తుంది.

అందులోనూ మొదటి నుండి తెలుగు వర్షన్ పై నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇలా పలువురు స్టార్ హీరోల పాత చిత్రాలను వారసుడు తలపిస్తుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా తేడా పడితే వారసుడు చిత్రానికి కనీస వసూళ్లు కూడా కష్టమే. అయితే దిల్ రాజు పూర్తి ఫోకస్ తమిళ వర్షన్ మీదే. వారసుడు జస్ట్ బోనస్ మాత్రమే. వారిసు భారీగా వసూళ్లు రాబడితే… వారసుడు ఆడకపోయినా దిల్ రాజుకు వచ్చిన నష్టం ఏమీ లేదు.