
Music Director Chakri Brother Mahit Narayan: టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ కి సంగీతం అందించి అనతి కాలం లోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిన వ్యక్తి చక్రి. ఈయన కంపోజ్ చేసిన పాటలు ఇప్పటికీ బయట వినపడుతూనే ఉంటుంది. అంత చక్కటి పాటలు అందించాడు ఆయన పూరి జగన్నాథ్ రెండవ సినిమా బాచి తో ఇండస్ట్రీ కి మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమైనా చక్రి, ఆ తర్వాత ఇటు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, దేశముదురు ఇలా ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించాడు.
ఆయన సంగీత దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘వెన్నెల్లో హాయ్ హాయ్’ 2016 వ సంవత్సరం లో విడుదలైంది.ఈ చిత్రం లోని పాటలకు కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ, సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇది ఇలా ఉండగా చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఆయన మాట్లాడుతూ ‘మా అన్నయ్య బ్రతికి ఉన్నంత కాలం ఆర్థికంగా మేము ఎంతో బాగున్నాము. కానీ ఎప్పుడైతే ఆయన చనిపొయ్యాడో మా కుటుంబం మొత్తం కష్టాల ఊబిలోకి చిక్కుకుంది. మా వదిన అన్నయ్య ఆస్తి లో సగభాగాన్ని తీసుకొని రెండవ పెళ్లి చేసుకొని అమెరికా లో మంచి గా స్థిరపడిపోయింది. రెండవ భర్త తో కలిసి మా అన్నయ్య ఆస్తిని మంచిగా ఎంజాయ్ చేస్తుంది.
కానీ మాకు రావాల్సిన ఆస్తి మాత్రం రాలేదు, కోర్టు లో కేసు వేసాము , ఇంకా ఆ కేసు నడుస్తూనే ఉంది, కచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఏడాది క్రితం వరకు నాకంటూ ఒక ప్రత్యేకమైన స్టూడియో లేదు. ఈమధ్యనే చక్రి అన్నయ్య పేరు తో ఒక స్టూడియో పెట్టుకున్నాను, రెస్పాన్స్ బాగానే ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు మహిత్ నారాయణ్.