
Andhrawala Re-Release Collections: ప్రతీ హీరో కెరీర్ లోను ఎప్పటికీ మర్చిపోలేని డిజాస్టర్ ఫ్లాప్స్ ఉంటాయి.అలా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో కూడా ఎన్నో ఫ్లాప్స్ ఉన్నాయి, వాటిల్లో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ‘ఆంధ్ర వాలా’ గురించి.సింహాద్రి వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో ఎవ్వరూ ఊహించని రేంజ్ అంచనాల నడుమ విడుదలైంది.
ప్రీ రిలీజ్ కి ముందు ఈ సినిమాకి వచ్చిన హైప్ ని చూసి జూనియర్ ఎన్టీఆర్ ఇక నెంబర్ 1 హీరో అయ్యిపోయాడని అందరూ అనుకున్నారు.అప్పట్లో నిమ్మకూరులో ఈ సినిమాకి నిర్వహించిన ఆడియో ఫంక్షన్ కి రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి అభిమానులు లక్షల సంఖ్యలో హాజరయ్యారు.ప్రత్యేక రైళ్లు మరియు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసి.అప్పట్లో ఈ ఆడియో రిలీజ్ వేడుక ఒక సంచలనం.ఆ హైప్ ని చూసి కచ్చితంగా ఈ చిత్రం భారీ హిట్ అవుతుంది అనుకున్నారు.

కానీ మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంది.2004 జనవరి 1 వ తారీఖున విడుదలైన ఈ సినిమా, జనవరి 13 వ తారీఖున థియేటర్స్ నుండి వెళ్ళిపోయింది.అంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అన్నమాట, అలాంటి ఫ్లాప్ సినిమాని నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేసారు.ఈమధ్య కాలం లో రీ రిలీజ్ ట్రెండ్ ఒక రేంజ్ లో కొనసాగుతుండడం, దానికి తోడు రామ్ చరణ్ కెరీర్ లో డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన ‘ఆరెంజ్’ సినిమా ఇటీవలే రీ రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ‘ఆంధ్ర వాలా’ సినిమా ని కూడా రీ రిలీజ్ చేసారు.
కానీ ఫలితం మాత్రం దారుణంగా వచ్చింది, ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సీడెడ్ లో 480 రూపాయిలు, ఆంధ్ర లో 460 రూపాయిలు మరియు నైజాం లో 60 రూపాయిలు వచ్చాయి.మొత్తం మీద అన్నీ ప్రాంతాలకు కలిపి వెయ్యి రూపాయిలు వచ్చాయి, ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకి ఇలాంటి వసూళ్లు రావడం అనేది అవమానకరం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.