MS Dhoni: టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని మిస్టర్ కూల్ గా పేరు పొందాడు. మైదానంతో ఎంతటి ఒత్తిడినైనా అలవోకగా తీసుకోవడం అతడికి అలవాటే. దీంతో వరల్డ్ కప్ ఫైనల్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ధోనిని చూసిన వారందరు అవాక్కయ్యారు. కొంచెం కూడా టెన్షన్ తీసుకోలేదు. ఏదో మామూలు వ్యక్తిలా కనిపించి అందరి మనసు దోచుకున్నాడు. అలాంటి ధోని సోషల్ మీడియాలో చురుకుగా ఉండడు. పోస్టులు పెట్టడు. ఏదైనా ఉంటే అతడి భార్యనే అతడి అకౌంట్ ను చెక్ చేస్తుంది. కానీ ధోని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పందించడు. ధోని ఏంటి ఇలా అందంగా మారాడు అని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ధోని డ్రెస్సింగ్ అందరిని అదరగొడుతోంది.

ఇటీవల కాలంలో వ్యాపారాల్లో మునిగిపోయాడు. రాంచీలో కూరగాయల పెంపకం వంటి వాటిని ఎంచుకుని అందరిలో ఆశ్చర్యం నింపాడు. లాభసాటిగా ఉండే వ్యాపారాలు చేయడం అతడికి కొత్తేమీ కాదు. పలు వ్యాపార ప్రకనల్లో కూడా తనదైన శైలిలో నటించడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులతో సందడి చేస్తూనే ఉంటాడు. పలు వ్యాపార ప్రకటనల్లో నటించి వారి ఉత్పత్తులు పెరిగేందుకు దోహదం చేస్తుంటాడు. బూస్ట్ లాంటి ప్రకటనలో ధోని కనిపిస్తున్నాడు.
ముంబైలోని ఫిల్మ్ సిటీలో ఓ వ్యాపార ప్రకటనలో నటించేందుకు ధోని, గంగూలీ ఇద్దరు వచ్చారు. ఇద్దరిది కూడా వేరు వేరు ప్రకటనలు అయినా స్థలం మాత్రం ఒక్కటే కావడం గమనార్హం. బ్రేక్ సమయంలో ఇద్దరు కలుసుకుని ముచ్చటించారు. ధోని డ్రెస్సింగ్ ఆకర్షణీయంగా ఉంది. దీంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ధోని పై అభిమానుల ట్వీట్లకు పొంగిపోతున్నాడు. టీమిండియాకు వరల్డ్ కప్ తీసుకొచ్చిన ఘనత కపిల్ దేవ్, ధోని ఇద్దరికే దక్కడం విశేషం. మరే కెప్టెన్ కూడా వరల్డ్ కప్ సాధించిన దాఖలాలు లేవు.
బీసీసీఐ చైర్మన్ గా ఉన్న గంగూలీని పదవీచ్యుతుడిని చేయడంలో కూడా ధోనీ పాత్ర ఉందనే కథనాలు వినిపించాయి. క్రికెట్లో ఇవన్నీ మామూలే. ఎన్నో విమర్శలు, మరెన్నో ప్రశంసలు రావడం సహజమే. ధోని మాత్రం దేనికి స్పందించడు. విజయమైనా పరాభవమైనా సమభావంతో చూడటమే అతడికి తెలిసిన విద్య. అందుకే అతడికి వివాదారహితుడనే పేరు కూడా ఉంది. దీంతో ధోనిని అందరు ఆదర్శంగా తీసుకుంటుంటారు. వికెట్ కీపర్ నుంచి కెప్టెన్ వరకు అతడి ప్రస్థానం కూడా విచిత్రంగానే ఉంటుంది.

ధోని డ్రెస్సింగ్ కు అందరు ఫిదా అవుతున్నారు. వీరి షూటింగ్ రెండు ఫోర్లలో జరిగినా ఒకే చోట ఉండటంతో కలుసుకుని కాసేపు ముచ్చటించుకున్నారు. ప్రస్తుత పరిస్థితులను గురించి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఎప్పుడు బిజీగా ఉండే ఇద్దరు మాజీ కెప్టెన్లు కలుసుకుని సరదాగా కబుర్లు చెప్పుకోవడం విశేషం. మళ్లీ వీరిద్దరు ఎక్కడ కలుస్తారో తెలియదు. కానీ ఎప్పుడో ఒకప్పుడు కలుసుకోవడం మాత్రం సహజమే అని నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు.