MrBeast: బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేయలేదు. పనికిమాలిన కంపెనీలకు ప్రచారం కల్పించలేదు. అడ్డమైన వ్యక్తులకు డబ్బా కొట్టలేదు. జస్ట్ ఒరిజినల్ కంటెంట్ మాత్రమే నమ్ముకున్నాడు. యూట్యూబ్ ను తనకు ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. అందువల్లే అతనిని యూట్యూబ్ చరిత్రలోనే అత్యధిక మంది అనుసరిస్తుంటారు. అలా వచ్చిన ఆదాయాన్ని అతడు వెనకేసుకోలేదు. సొంత ఖర్చులకు వాడుకోలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఖరీదైన బంగ్లాలు కొనుగోలు చేయలేదు. విలువైన స్థలాలను సొంతం చేసుకోలేదు. తనకు ఎవరి ద్వారా అయితే డబ్బు వస్తోందో.. ఆ డబ్బును వారికి ఖర్చుపెట్టి తన దాన గుణాన్ని నిరూపించుకున్నాడు ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షకులు ఉన్న యూట్యూబర్ మిస్టర్ బీస్ట్.
Also Read: నరేన్ కొడాలి నాయకత్వంలో తానాలో కొత్త శకం ప్రారంభం!
ప్రపంచంలో అత్యధిక మంది వీక్షకులు ఉన్న యూట్యూబర్ గా మిస్టర్ బీస్ట్ కొనసాగుతున్నాడు. మిస్టర్ బీస్ట్ ను యూట్యూబ్లో 41 కోట్ల మంది అనుసరిస్తున్నారు. యూట్యూబ్ చరిత్రలోనే అత్యధికమంది వీక్షకులు ఉన్న వ్యక్తిగా మిస్టర్ బీస్ట్ కొనసాగుతున్నాడు. యూట్యూబ్ ద్వారా మిస్టర్ బీస్ట్ కోట్లల్లో ఆదాయాన్ని సంపాదిస్తాడు. అయితే అలా వచ్చిన ఆదాయాన్ని అతడు తన సొంత ఖర్చులకు ఉపయోగించుకోడు. సొంత ఆస్తులు పెంచుకోవడానికి వినియోగించడు. కేవలం ప్రజా సేవ కోసం మాత్రమే వాటిని వినియోగిస్తాడు. దాతృత్వంలో అతడు ఎప్పుడు ముందుంటాడు. ఇప్పటివరకు అతడు రైతుల కోసం ఐదు లక్షల బోర్లు వేయించాడు. కోటి మాదికి ఆహారాన్ని అందించాడు. మిలియన్ డాలర్ల విలువైన దుస్తులను పేదలకు దానం చేశాడు. యుద్ధం వల్ల సర్వం కోల్పోయిన వారికి 30 లక్షల డాలర్ల విలువైన వస్తువులను అందించాడు. ఇక ఆఫ్రికా ఖండంలో పేదరికంతో మగ్గిపోతున్న పిల్లలకు 20,000 జతల బూట్లు అందించాడు. 3000 మందికి కృత్రిమ కాళ్లను పంపిణీ చేశాడు. అంతేకాదు 1000 మందికి నేత్ర సంబంధిత వ్యాధుల నివారణకు ఆపరేషన్ చేయించాడు. వెయ్యి మందికి చెవిటి నిరోధక ఆపరేషన్లు చేయించాడు.
యూట్యూబ్లో మిస్టర్ బీస్ట్ విభిన్నమైన వీడియోలను పోస్ట్ చేస్తాడు. అవన్నీ కూడా వీక్షకులను కట్టిపడేస్తాయి. అందువల్లే అతడికి యూట్యూబ్లో ఇంతటి ఆదరణ ఉంటుంది. అతడు ఒక వీడియో పోస్ట్ చేస్తే చాలు క్షణాల్లోనే వైరల్ అయిపోతుంది. వందలు వేలు దాటి కోట్లలోకి చేరుకుంటుంది. ఇటీవల ఒక సింహానికి సంబంధించిన వీడియోను అతడు పోస్ట్ చేస్తే.. ఇప్పటికే అది ఐదు కోట్ల వీక్షణలు సొంతం చేసుకుంది. ఇలా చెప్పుకుంటూ పోవాలే గాని అతడి అద్భుతాలకు కొదవ ఉండదు. అతడు యూట్యూబ్లో సంచలన వీడియోలను పెట్టడు. రియాల్టీకి దగ్గరగా ఉన్న వీడియోలను మాత్రమే పెడతాడు. అతడికి ఇంతటి పేరు వచ్చినప్పటికీ పెయిడ్ ప్రమోషన్లు చేయడు. పెయిడ్ ప్రమోషన్ల కోసం అతడికి ఎన్నో ఆఫర్లు వచ్చాయి. అయినప్పటికీ అతను అవన్నీ పట్టించుకోడు. కేవలం తన ఒరిజినల్ కంటెంట్ మాత్రమే నమ్ముకుంటాడు. అలా నమ్మకపోవడం వల్లే ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద యూట్యూబర్ అయిపోయాడు. కోట్లలో సంపాదిస్తూ.. ఆ సంపాదనను కూడా ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసి.. పనికిమాలిన కంపెనీలకు ప్రమోషన్ చేసి కోట్ల కోట్లు సంపాదిస్తున్న సోకాల్డ్ యూబర్ల కంటే మిస్టర్ బీస్ట్ కోట్ల రెట్లు ఉత్తమం. ఎందుకంటే అతడికి డబ్బు అవసరం లేదు. డబ్బు అంటే ఇష్టం లేదు. కేవలం తన అవసరాలకు సరిపోతే చాలు. మిగతావన్నీ ప్రపంచానికే ఇస్తున్నాడు. ఎందుకంటే ప్రపంచం వల్లే కదా అతడు ఈ స్థాయిలో గుర్తింపు పొందింది..
