https://oktelugu.com/

Vizianagaram : సినిమా ఛాన్స్ కోసం.. కుమార్తెను అలా చేసింది… తల్లి చేసిన దారుణాలివీ

కుమార్తెను సినిమా హీరోయిన్ చేద్దామని తల్లి కలలుగంటోంది. ఈ క్రమంలో బాలిక అవయవాలు బొద్దుగా పెరగాలని.. అప్పుడే హీరోయిన్ గా ఎంపికయ్యే చాన్స్ ఉందని ఎవరో ఇచ్చిన సలహా మేరకు బాలికపై సూదిమందులు ప్రయోగించింది. నొప్పి భరించలేని బాలిక 1098 ద్వారా చైల్డ్ లైన్ ను ఆశ్రయించింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : June 3, 2023 / 10:04 AM IST
    Follow us on

    Vizianagaram : ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ సినిమా అవకాశం కోసం అమాయకంగా అడిగే యువతి, అందుకు తన బెడ్ పైకి రావాలనే దర్శకుడు, ఇక్కడ బాగుపడాలంటే తప్పదు అని కూతురును సముదాయించే తల్లి…అప్పుడెప్పుడో వచ్చిన ఖడ్గం చిత్రంలో దృశ్యాలివి. సినీ రంగుల ప్రపంచంలో తెర వెనుక జరిగే దృశ్యాలను దర్శకుడు కృష్ణవంశీ కళ్లకు కట్టినట్టు చూపించారు. అటువంటి దృశ్యమే తాజాగా విజయనగరంలో వెలుగుచూసింది. పదో తరగతి చదువుతున్న కుమార్తెను పెద్ద హీరోయిన్ చేసేందుకు సూదిమందులను బలవంతంగా వేస్తోంది ఆ తల్లి. ఆ వేధింపులు భరించలేక బాధిత బాలిక చైల్డ్ లైన్ ను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

    విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో  ఓ మహిళ (42) నివాసముంటోంది. ఆమెకు ఒక కుమార్తె ఉంది. ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో ఇంట్లోకి తరచూ కొందరు వ్యక్తులు వస్తున్నారు. ఇది బాధిత బాలికకు ఇష్టం లేదు. తల్లితో గొడవపడడంతో బాలికను విశాఖలోని ప్రభుత్వ విద్యాసంస్థలో చేర్పించింది. పదో తరగతి పరీక్షాలు రాసిన తరువాత బాలిక ఇటీవలే ఇంటికి చేరుకుంది.

    కుమార్తెను సినిమా హీరోయిన్ చేద్దామని తల్లి కలలుగంటోంది. ఈ క్రమంలో బాలిక అవయవాలు బొద్దుగా పెరగాలని.. అప్పుడే హీరోయిన్ గా ఎంపికయ్యే చాన్స్ ఉందని ఎవరో ఇచ్చిన సలహా మేరకు బాలికపై సూదిమందులు ప్రయోగించింది. నొప్పి భరించలేని బాలిక 1098 ద్వారా చైల్డ్ లైన్ ను ఆశ్రయించింది. దీంతో పోలీసుల సహకారంతో చైల్డ్ లైన్ ప్రతినిధులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలికను బాలసదన్ కు పంపించారు.

    సదరు మహిళకు ఇది వరకే రెండు వివాహాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం వేరే వ్యక్తితో సహజీవనం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. మొదటి భర్తకు పుట్టిన పిల్లే ఈ బాధిత బాలిక. బాలిక తండ్రి మరణించడంతో మహిళ మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె తీరు నచ్చక భర్త ఇద్దరు పిల్లలను తీసుకెళ్లిపోయాడు. మొదటి భర్తకు పుట్టిన కుమార్తెను హీరోయిన్ చేద్దామని భావించిన తల్లి ఘాతుకానికి పాల్పడింది. అడ్డంగా బుక్కయ్యింది.