
Mohan Babu- Manoj: సినీ నటుడు మంచు మనోజ్, మౌనికా రెడ్డిల వివాహం ఇటీవల ఆడంబరంగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. అతికొద్ది మంది సమక్షంలో ఈ వివాహం జరగడంతో మీడియా ఎక్కువగా ఫోకస్ చేయలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం మ్యారేజ్ పిక్స్ వైరల్ అయ్యాయి. మంచు మనోజ్ తో పాటు మౌనికకు ఇది రెండో వివాహం. అలాగే మౌనికకు ఓ కుమారుడు కూడా ఉన్నారు.
పెళ్లి తరువాత మనోజ్ దంపతులు శ్రీవారి దర్శనానికి తిరుమలకు వెళ్లారు. ఈ సందర్భంగా కలిసొచ్చిన కాలానికి నడిసొచ్చే కొడుకు అంటూ కొందరు క్యాప్షన్లు పెట్టి హల్ చల్ చేశారు. మనోజ్ పెళ్లి సందర్భంగా ఇలాంటి న్యూస్ తో పాటు మరో హాట్ టాపిక్ కూడా వైరల్ అయింది. అదేంటంటే మోహన్ బాబుకు ఈ పెళ్లి ఇష్టం లేదని. దీనిపై కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో తీవ్ర చర్చ సాగింది. ఇదే విషయాన్ని కొందరు అడగ్గా ఆయన రిప్లైని చూసి షాక్ అవుతున్నారు.
మంచు మోహన్ బాబు ఏదైనా స్ట్రేట్ గా మాట్లాడేస్తారు. లోపల ఏం దాచుకోడని ఇండస్ట్రీలో పేరుంది. చాలా సందర్భాల్లో ఆయన సూటిగా సుత్తిలేకుండా కొన్ని విషయాలు బయటపెట్టారు. అయితే ఆయన ఫ్యామిలీపై కొందరు ట్రోల్ చేయడం అలవాటైపోయింది. అయినా మోహన్ బాబు అవన్నీ పట్టించుకోలేదు. తన పనితాను చేసుకుంటూ పోతున్నారు. ఇటీవల తన రెండో కుమారుడు మనోజ్ పెళ్లి మోహన్ బాబుకు ఇష్టం లేదని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో కొందరు నేరుగా మోహన్ బాబు వద్దకు వెళ్లి ఈ విషయాన్ని అడిగారు. ఆయన తన స్టైల్లో రిప్లై ఇచ్చారు.

‘మనోజ్ తన పెళ్లి గురించి నా దగ్గరకు వచ్చాడు. నాన్న నేను మౌనికను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే ఒకసారి ఆలోచించుకొమ్మని చెప్పాను. ఆలోచించేదేమీ లేదని మనోజ్ చెప్పాడు. దీంతో ఓకే చెప్పాను. భూమారెడ్డి కుటుంబం చాలా మంచిది. వాళ్ల అమ్మాయిలు కూడా మంచి వ్యక్తిత్వం కలిగిన వారని చెప్పాను. అయితే ఎవరో ఏదోఅంటున్నారని ఫీల్ కాకు. ఎంతో మంది మనం చేసే పనులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. వారిని దాటుకుంటూ ముందుకెళ్లాలి. అప్పుడే విజయం మన తథ్యమవుతుంది అని చెప్పాను’ అని మోహన్ బాబు అన్నారు.
ఇక మోహన్ బాబుపై వచ్చిన ట్రోలింగ్ పై మాట్లాడుతూ ‘కొందరు పనిలేనివాళ్లు ఇలాంటి కామెంట్లు చేస్తారు. నాకు పెళ్లి ఇష్టం లేదని నేను వాళ్లతో చెప్పానా? ఇది మా వ్యక్తిగత విషయం. సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిమీద శ్రద్ద పెట్టి నిరూపించుకోండి. అంతేగాని పర్సనల్ విషయాలపై ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు’ అని తనను విమర్శించేవాళ్లకు ఘాటుగా రిప్లై ఇచ్చారు.