
Mohan Babu- Manoj Marriage: మనోజ్-మౌనికల వివాహం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. భూమా మౌనికను వివాహం చేసుకోవడం మోహన్ బాబుకు ఇష్టం లేదన్న వాదన వినిపించింది. ఈ వాదనలను బలపరిచే విధంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనోజ్ కొన్నాళ్ళు కుటుంబానికి దూరంగా ఉన్నారు. విష్ణు తమ్ముడిని దూరం పెట్టాడు. మనోజ్ బర్త్ డే విషెస్ తెలియజేస్తే కనీసం తిరిగి స్పందించలేదు. మోహన్ బాబు, విష్ణు పట్టించుకోని పక్షంలో మనోజ్ పెళ్లి బాధ్యత మంచు లక్ష్మి తీసుకున్నారు. తన నివాసంలో మనోజ్ వివాహం ఘనంగా చేశారు.
మూడు రోజులుగా మనోజ్ పెళ్లి వేడుకలు జరుగుతున్నా మోహన్ బాబు రాలేదు. అసలు పెళ్లికైనా వస్తారా లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. ముహూర్తానికి కొన్ని నిమిషాల ముందు మోహన్ బాబు సతీసమేతంగా వచ్చారు. నవ దంపతులను ఆశీర్వదించారు. ఇవన్నీ గమనించాక… ఎవరికైనా కొన్ని సందేహాలు కలుగుతాయి. తప్పక, మనసొప్పక మోహన్ బాబు మనోజ్ పెళ్ళికి వచ్చి ఉండొచ్చనే అనుమానాలు రాకమానవు.
కాగా ఈ వార్తలపై మోహన్ బాబు స్వయంగా స్పందించారు. ‘మనోజ్ నా దగ్గరకొచ్చి మౌనికను వివాహం చేసుకుంటాను నాన్నా అన్నాడు. ఒకసారి ఆలోచించుకో అని అన్నాను. లేదు నాన్న నిర్ణయం తీసుకున్నాను, అన్నాడు. ఒకే గో ఎహెడ్ అన్నాను. మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదన్న కథనాల్లో వాస్తవం లేదు. కుక్కలన్నాక మొరుగుతూనే ఉంటాయి. ఎన్ని కుక్కలను మాత్రం కంట్రోల్ చేస్తాం చెప్పండి. జనాల మాటలు పట్టించుకుంటే మనం జీవితంలో ఏ పని చేయలేము… అని తనదైన శైలిలో చెప్పారు.

మార్చి 19న మోహన్ బాబు బర్త్ డే కాగా… కోడలు మౌనిక అన్నీ తానై వ్యవహరించారు. జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. మౌనిక గతంలో గణేష్ రెడ్డి అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి. 2018లో మౌనిక విడాకులు తీసుకున్నట్లు సమాచారం. ఇక 2019లో ప్రణతి రెడ్డితో మంచు విష్ణుకు విడాకులయ్యాయి. మనోజ్-మౌనికలకు చాలా కాలంగా పరిచయం ఉంది. మౌనిక కుమారుడి బాధ్యత మనోజ్ తీసుకున్నారు.