https://oktelugu.com/

MM Keeravani : ఆసుపత్రిలో కదల్లేని స్థితిలో కీరవాణి.. ఏమైంది?

MM Keeravani : ఆస్కార్ అవార్డును రీసెంట్ గా అందుకున్న ఎం ఎం కీరవాణిని దేశం మొత్తం కీర్తిస్తోంది. ఆయన రూపొందించిన ‘నాటు నాటు’ సాంగ్ కు వరల్డ్ లెవల్లో ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కీరవాణి ఏం చేస్తున్నారు? నెక్ట్స్ ఏ సినిమా కోసం పనిచేస్తున్నారు? అన్న ప్రశ్నలకు షాకింగ్ సమాధానం వస్తోంది. కీరవాణి ప్రస్తుతం హాస్పిటల్ బెడ్ పై కదల్లేని స్థితిలో ఉన్నారట. ఇటీవల తీవ్ర అస్వస్థకు గురైన ఆయన చికిత్స […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 28, 2023 / 11:34 AM IST
    Follow us on

    MM Keeravani : ఆస్కార్ అవార్డును రీసెంట్ గా అందుకున్న ఎం ఎం కీరవాణిని దేశం మొత్తం కీర్తిస్తోంది. ఆయన రూపొందించిన ‘నాటు నాటు’ సాంగ్ కు వరల్డ్ లెవల్లో ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కీరవాణి ఏం చేస్తున్నారు? నెక్ట్స్ ఏ సినిమా కోసం పనిచేస్తున్నారు? అన్న ప్రశ్నలకు షాకింగ్ సమాధానం వస్తోంది. కీరవాణి ప్రస్తుతం హాస్పిటల్ బెడ్ పై కదల్లేని స్థితిలో ఉన్నారట. ఇటీవల తీవ్ర అస్వస్థకు గురైన ఆయన చికిత్స తీసుకుంటున్నారట. తెలుగు మీడియాలో ఎక్కడా ఈ విషయం కనిపించలేదు. ఓ జాతీయ మీడియాలో కీరవాణి గురించి ఈ విషయం బయటకు రావడంతో అంతా షాక్ తింటున్నారు. ఇంతకీ కీరవాణికి ఏమైనట్లు? అసలేం జరిగింది?

    తెలుగు సినిమా చరిత్రను ప్రపంచానికి పరిచయం చేశారని కీరవాణిని ఇప్పటికీ అభినందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడంతో ఆయనను కీర్తిస్తున్నారు. ఈ అవార్డు కోసం చిత్రం యూనిట్ తీవ్రంగా కృషి చేసింది. ఇందులో భాగంగా కీరవాణి కూడా పలు అంతర్జాతీయ వేదికలపై నాటు నాటు సాంగ్ ను ప్లే చేసేందుకు సహకరించారు. తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. మొత్తానికి అవార్డు రావడంతో చంద్రబోస్ తో కలిసి కీరవాణీ ఈ అవార్డును అందుకున్నారు.

    ఇక ఈ అవార్డు కోసం కీరవాణి బిజీ కావడంతో ఆయన అస్వస్థకు గురైనట్లు సమాచారం. ఆ తరువాత ఇండియాకు వచ్చిన తరువాత మరింత నీరసంగా మారారు. దీంతో ఆసుపత్రిలో చేరి చెక్ చేసుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. కీరవాణికి కరోనా పాజిటివ్ అని తెలుగు మీడియాలో ఎక్కడా వినిపించలేదు. ఓ జాతీయ మీడియాకు కీరవాణి తనకు కరోనా పాజిటివ్ అని చెప్పినట్లు సమాచారం.

    ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స తసుకుంటున్న ఫొటోలు నెట్టింట్లోపెట్టారు. ఆ తరువాత మీడియా మొత్తం కవర్ చేయడంతో అంతా షాక్ కు గురయ్యారు. కీరవాణి త్వరగా కోలుకోవాలని సినీ ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు అభిమానులు, నెటిజన్లు ప్రార్థిస్తున్నారు. అలాగే కీరవాణి కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యంపై నిత్యం పర్యవేక్షిస్తున్నారు.