https://oktelugu.com/

Hyderabad : పెళ్లైన 45 ఏళ్ల లేడీ టీచర్ తో, 35 ఏళ్ల యువకుడి ప్రేమ.. చివరికిలా అయ్యింది

రాజేష్ కు ఉపాధ్యాయురాలితో ఫోన్ లో పరిచయం ఏర్పడింది. తరువాత ఉపాధ్యాయురాలు తన వ్యక్తిగత ఫొటోలను రాజేష్ కు పంపడంతో విపరీతమైన ప్రేమను పెంచుకున్నాడు. నిత్యం ఉపాధ్యాయురాలి ఇంటి చుట్టూ తిరిగేవాడు. అప్పటికే ఆమెకు వివాహమైంది. భార్త, పిల్లలు ఉన్నారు. అటు ఉపాధ్యాయురాలు సైతం యువకుడ్ని ఇష్టపడుతున్నట్టు తెలుస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : June 1, 2023 / 05:48 PM IST
    Follow us on

    Hyderabad : ఆమెకు 45 ఏళ్లు.. ఆ యువకుడికి 25 ఏళ్లు. ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి వచ్చింది. కానీ ఆమె మాత్రం కుటుంబాన్ని వదులుకోలేకుంది. సభ్య సమాజం ఏమంటుందోనని సతమతమైంది.   అలాగని ప్రేమను వదులుకునేందుకు మనసు అంగీకరించలేదు. దీంతో బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న యువకుడూ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ హయత్ నగర్ లో వెలుగుచూసింది ఈ ప్రేమికుల విషాదాంతం.

    ములుగు జిల్లా పంచోత్కులపల్లికి చెందిన ఎల్లావుల పరశురాములు, విజయ దంపతుల కుమారుడు రాజేష్ (25) కుంట్లూరు డాక్టర్స్ కాలనీలో ఈ నెల 29న అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తొలుత ఆత్మహత్యగా భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు అదేరోజు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందిన ఉపాధ్యాయురాలు (45)తో ప్రేమ కారణంగా నిర్ధారించారు.

    రాజేష్ కు ఉపాధ్యాయురాలితో ఫోన్ లో పరిచయం ఏర్పడింది. తరువాత ఉపాధ్యాయురాలు తన వ్యక్తిగత ఫొటోలను రాజేష్ కు పంపడంతో విపరీతమైన ప్రేమను పెంచుకున్నాడు. నిత్యం ఉపాధ్యాయురాలి ఇంటి చుట్టూ తిరిగేవాడు. అప్పటికే ఆమెకు వివాహమైంది. భార్త, పిల్లలు ఉన్నారు. అటు ఉపాధ్యాయురాలు సైతం యువకుడ్ని ఇష్టపడుతున్నట్టు తెలుస్తోంది. చివరిసారిగా ఈ నెల 24న డాక్టర్స్ కాలనీలో ఇద్దరూ కలుసుకున్నారు. అప్పటికే ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్న ఉపాధ్యాయురాలు తన వెంట తెచ్చుకున్న క్రిమిసంహారక మందును తాగింది. ఇంటికి వెళ్లి అస్వస్థతకు గురైంది. కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న రాజేష్ సైతం క్రిమిసంహారక మందు తాగి అక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఈ నెల 29న మృతిచెందిన నాడే రాజేష్ మృతదేహం వెలుగుచూడడం విశేషం. దీంతో సమగ్ర దర్యాప్తు చేసిన పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. ప్రేమ వ్యవహారమే కారణమని నిర్ధారించారు.