Siberia Coldwave: భూమిపై మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. వాతావరణాన్ని కలుషితం చేస్తూ మన పతనాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఫలితంగా ప్రతికూల ప్రభావాలు వేధిస్తున్నాయి. కాలక్రమంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. దీంతో మనిషి జీవనం గగనంగా మారిపోయే ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. భూతాపం పెరగడం వల్ల ముప్పు ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. అడవులను నాశనం చేస్తున్నారు. కొండలను పిండి చేస్తున్నారు. దీంతో వాతావరణం కలుషితంగా మారుతోంది. రాబోయే రోజుల్లో దీని ఫలితాలు మరింత తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అంటార్కిటికా ఖండంలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నాయి.

సైబీరియాలో మైనస్ 62.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో మంచు యుగం రాబోతోందా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. గత ఇరవై ఏళ్లలో ఇంతటి తక్కువ ఉష్ణోగ్రతలు రావడంతో భవిష్యత్ లో రాగల సంకేతాలు తెలియజేస్తున్నాయి. అంగారక గ్రహంపై సగటు ఉష్ణోగ్రతలకు సమానమైన ఉష్ణోగ్రతలు సైబీరియాలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. సైబీరియాలో కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు రావడంతో ప్రజలు భయపడుతున్నారు.
సైబీరియాలో ఉష్ణోగ్రతలు పాత రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో మంచు యుగం వస్తుందేమోననే సందేహాలు వస్తున్నాయి. చలి మరింత పెరుగుతోంది. రష్యాలోని సఖా రిపబ్లిక్ కు చెందిన గ్రామీణ ప్రాంతం తోంగులక్ దగ్గర కనిష్ట ఉష్ణోగ్రతలు భయపెడుతున్నాయి. ఇక్కడ మైనస్ 50 డిగ్రీలు దాటడం గమనార్హం. ఈ నేపథ్యంలో మార్స్ గ్రహంపై పగటి ఉష్ణోగ్రత 20 డిగ్రీలు, రాత్రి మైనస్ 153 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండటంతో వార్షిక సగటు ఉష్ణోగ్రత మైనస్ 62 డిగ్రీలుగా ఉంటోంది.

సఖా రిపబ్లిక్ లోని ఒయిమ్యాకొన్ లో ఫిబ్రవరి 6,1933 లో అతి తక్కువ ఉష్ణోగ్రత మైనస్ 67.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ప్రస్తుతం ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఇప్పుడు ఉష్ణోగ్రతలు ఉండటంతో మంచుయుగం మళ్లీ వస్తుందని నమ్ముతున్నారు. ఇప్పటివరకు ఐదుసార్లు మంచుయుగం వచ్చినట్లు చెబుతున్నారు. త్వరలో ఆరో మంచు యుగం కూడా రావడం ఖాయమనే వాదనలు వస్తున్నాయి. తగ్గుతున్న ఉష్ణోగ్రతలు మంచు యుగానికి సంకేతమే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.