Bryan Johnson: అందంగా ఉండాలని ఎవరికైనా ఉంటుంది. కాకపోతే వయసు పెరుగుతుంటే శరీరంలో మార్పులు వస్తాయి కాబట్టి కచ్చితంగా ఒకప్పటి అందం ఉండదు. ఒక మనిషి యుక్త వయసులో ఉన్నప్పుడు చర్మం కాంతివంతంగా ఉండడం వల్ల అందంగా కనిపిస్తాడు. అదే వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో కాంతి, తేమ తగ్గుతాయి. ఫలితంగా ముఖం అనేది వర్చస్సు కోల్పోతుంది.. అయితే అందాన్ని కాపాడుకునేందుకు ఆడవాళ్లు మాత్రమే కాదు మగవాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.. అప్పట్లో ప్రఖ్యాత పాప్ గాయకుడు మైకేల్ జాక్సన్ తన అందాన్ని కాపాడుకునేందుకు కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. రకరకాల సర్జరీలు చేయించుకున్నాడు. కానీ చివరికి అందం అనేది భౌతికంగా కాదు.. మానసికంగా ఉండాలని తెలుసుకున్నాడు. కానీ అప్పటికే అతనికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫలితంగా అతడు కన్నుమూశాడు.
మైకల్ జాక్సన్ మాత్రమే కాదు ప్రపంచంలో సెలబ్రిటీలు తమ అందాన్ని కాపాడుకునేందుకు రకరకాల సర్జరీలు, రకరకాల డైట్లు ఫాలో అవుతున్నారు. అప్పట్లో అమెరికాకు చెందిన ఓ నటి తన అంతర్గత అవయవాలు పెద్దగా ఉన్నాయని భావించి.. సర్జరీ చేయించుకుంది. అప్పట్లో దానికైన ఖర్చు 20 కోట్లని వార్తలు రావడంతో ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఇక బాలీవుడ్ లో ఒక నటుడు తన పెదవుల సైజ్ తగ్గించుకునేందుకు ఏకంగా మూడు కోట్ల దాకా ఖర్చు పెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాలో నటీనటులే కాదు క్రీడాకారులు కూడా ఉంటారు. అయితే తాజాగా అమెరికాకు చెందిన ఓ మిలియనీర్ తన అందానికి సంబంధించి పెట్టిన ఖర్చు టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే..
అమెరికాకు చెందిన బ్రయాన్ జాన్సన్ కు 46 సంవత్సరాలు ఉంటాయి. ఇతడు ఒక టెక్ మిలియనీర్. డబ్బు ఎక్కువగా ఉండటం.. అందం మీద మోజు కలగడంతో అతడు 18 ఏళ్ల యువకుడి లాగా కనిపించాలని భావించాడు. ఆలోచన వచ్చిందే తడవుగా తన అందాన్ని మెరుగుపరుచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. పేరుపొందిన కాస్మటాలజిస్టును కలిశాడు. ఇంకేముంది ఇద్దరు కలిసి పని మొదలుపెట్టారు. దీనికోసం అతడు రోజుకు వందకు మించి మాత్రలు వేసుకుంటున్నాడు. అంతేకాదు 2018, 2023, 2024లో తను తీసుకున్న మూడు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆరు సంవత్సరాల తన ముఖంలో వచ్చిన మార్పుల గురించి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అలా 46 ఏళ్ల అతను 18 సంవత్సరాల యువకుడి లాగా కనిపిస్తున్నాడు. దీనికోసం ప్రతి సంవత్సరం అతడు 16 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాడు. అయితే ఇలా తన మొఖం మారిపోవడంతో తన ఫేస్ ఐడిని ఆఫీస్ లోనే పంచ్ మిషన్ గుర్తించడం లేదని చెప్పుకొచ్చాడు.. కాగా జాన్సన్ చేస్తున్న ప్రయోగం పట్ల చాలామంది నెటిజన్లు నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. స్వచ్ఛమైన ఆహారం, పరిశుభ్రమైన తాగునీరు, ఆరోగ్యకరమైన జీవన విధానాలు పాటిస్తే శరీరం ఎప్పటికీ తాజాగా ఉంటుందని.. చర్మం కాంతివంతంగా తయారవుతుందని.. అవి చేయకుండా రోజు 100 మాత్రలు మిగితే ఏం ఉపయోగం ఉంటుందని.. అవి శరీరంలో దుష్పరిణామాలకు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Millionaire bryan johnson shares pictures of his age reversing transformation in 6 years
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com