KGF Garuda: అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది. కానీ దురదృష్టం తలుపు తెరిచే వరకు తడుతుందట బతుకు పోరాటంలో కొన్నిసార్లు విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. కొందరికి విది వెక్కిరిస్తుంది మరికొందరికి నీడలా వెంటాడుతుంది. ఇటీవల విడుదలైన కేజీఎఫ్ 2 చిత్రంలో నటీనటులను పరిశీలిస్తే నిజమే అనిపిస్తుంది. వారు పుట్టిన నేపథ్యం వేరు వారు పనిచేసే స్థలం కూడా సంబంధం లేకున్నా వారు సినిమాలో అవకాశాలు దక్కించుకుని స్టార్లుగా ఎదగడం తెలిసిందే. దీంతో వారి కుటుంబం వివరాలు తెలిస్తే అందరు షాక్ అవుతున్నారు. అసలు సినిమాలంటేనే తెలియని వారికి ఏకంగా సెలబ్రిటీలుగా మారి పోవడం చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.
కేజీఎఫ్ 2లో విలన్ గా నటించిన రామచంద్రరాజు కథ వింటే ఆశ్చర్యం వేస్తుంది. కకేజీఎఫ్ 2లో పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితాలు అన్నట్లుగా అందరి వివరాలు తెలిస్తే అందరు షాకవుతున్నారు. సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా దర్వకుడు అవ్వాలని రాలేదు. ఏదో అనుకోకుండా ఇలా అవకాశం కలిసి రావడంతో కథ మలుపు తిరిగింది. హీరో యష్ కూడా సీరియళ్లలో నటిస్తూ హీరోగా అరంగేట్రం చేసి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. సంగీత దర్శకుడిది కూడా ఇంకో కథ. ఇలా చెప్పుకుంటూ పోతే అందరు ఎక్కడో కలుసుకుని ఒక టీంగా ఏర్పడి సినిమా తీయడం ఓ వింతే.
Also Read: Mike Tyson: వైరల్ వీడియో: విసిగించిన అభిమానిని విమానంలో చితక్కొట్టిన మైక్ టైసన్
ఇక సినిమాలో విలన్ గా నటించిన రామచంద్రరాజుది మరో స్టోరీ. అతడు గత 12 ఏళ్లుగా యష్ కు కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు .కథా చర్చల కోసం వచ్చినప్పుడు అతడిలో ఉన్న ప్రతినాయకుడి లక్షణాలు చూసిన దర్శకుడు గడ్డం పెంచుకుని కనిపించమన్నాడట. అలా అతడి వేషం ఖరారైంది. మొత్తానికి అనుకోకుండా అల్లుకున్న కథతో అందరు కలిసినా చివరకు అందరికి మంచి పేరు తీసుకొచ్చింది. దీంతో అందరికి అవకాశాలు క్యూ కడుతున్నాయి అచ్చం సినిమా స్టోరీలా వారి జీవితాలు కూడా యాదృచ్చికంగా కలవడం విశేషమే.
ఒక కారు డ్రైవర్ పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం సామాన్యమైన విషయమేమీ కాదు.తన నటనతో అందరిని మెప్పించాడు. సినిమా విజయంలో తనదైన పాత్ర పోషించాడు. అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు. హీరో అయినంత కాకపోయినా ప్రతినాయకుడి పాత్రకు ప్రస్తుతం ఇతడిని అందరు సందప్రదిస్తున్నారట. గరుడగా సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేశాడు. అందుకే అంటారు. వాడికి అదృష్టం పడిశం పట్టినట్లు పట్టిందంటారు. ఇప్పుడు రామచంద్రరాజు విషయంలో కూడా అదే జరిగిందని చెబుతున్నారు.
Also Read:Singer Sunitha: 43 ఏళ్ల వయసులో మళ్లీ తల్లి కాబోతున్న స్టార్ సింగర్
Recommended Videos: