Microsoft CEO Satya Nadella- MS Dhoni: ఎంఎస్ ధోని… ఈ క్రికెట్ దిగ్గజం గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇతడు ఏం చేసినా సంచలనమే..డౌన్ టు ఎర్త్ లాగా ఉండే ఈ క్రికెట్ శిఖరం ఎంతో మందికి ఆదర్శం.. ఆట తీరు, మైదానంలో ప్రవర్తన, మాట్లాడే తీరు, హుందా తనం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. అలాంటి ధోని జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత ఇతర వ్యాపకాల్లోకి వెళ్లిపోయాడు. ధోనీ అంటేనే సమ్ థింగ్ స్పెషల్ కాబట్టి ఎక్కువ ప్రచారాన్ని కోరుకోడు. సింపుల్ గా జీవితాన్ని లాగిం చేస్తుంటాడు. మొన్న ఆ మధ్య విమానంలో ప్రయాణిస్తూ ధోనిని ఎవరో ప్రయాణికుడు వీడియో తీశారు. ఆ వీడియో లో ధోనీ క్యాండీ క్రష్ ఆడుతూ కనిపించాడు. ఎయిర్ హోస్టెస్ వచ్చి ఏమైనా కావాలా అని అడిగితే రెండో మాటకు తావు లేకుండా నో చెప్పాడు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అసలే ధోనీ, పైగా విమానం లో క్యాండీ క్రష్ ఆడుతున్నాడు. జనాలకు ఆసక్తి పెరిగింది. వారు కూడా ధోనిని అనుసరించడం మొదలుపెట్టారు.. లక్షల సంఖ్యలో క్యాండీ క్రష్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ గేమ్ ను డెవలప్ చేసిన సంస్థ స్వయంగా వెల్లడించింది. ఇక ధోని క్యాండీ క్రష్ జాబితాలో మరో సెలబ్రిటీ చేరాడు. ఆయన మరెవరో కాదు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.
ధోని క్యాండీ క్రష్ ఆడిన తర్వాత.. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన తర్వాత.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల క్యాండీ క్రష్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. తాను కూడా చాలామంది లాగే క్యాండీ క్రష్ ఆడతానని వెల్లడించారు. అది కూడా ఒక కోర్టులో ఈ విషయాన్ని సత్య నాదెళ్ల వెల్లడించడం విశేషం. “అసోసియేట్ ప్రెస్” నివేదిక ప్రకారం “యాక్టివిజన్ బ్లిజార్డ్” అనే వీడియో గేమింగ్ కంపెనీ కొనుగోలుకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. క్యాండీ క్రష్ గురించి మీ అభిప్రాయం చెప్పండి అని సత్య నాదెళ్ల ను న్యాయమూర్తి అడిగారు. దీనికి స్పందించిన నాదెళ్ల ధోని లాగే తాను కూడా ఈ గేమ్ ఆస్వాదిస్తానని, దీంతోపాటు కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ఆడుతుంటానని వివరించారు. కన్ సోల్ గేమ్స్, పీసీ గేమ్స్ అంటే ఇష్టమని, ప్రత్యేకంగా మొబైల్ గేమ్స్ అంటే ఆసక్తి చూపిస్తుంటానని నాదెళ్ల చెప్పుకొచ్చారు. దీంతో న్యాయమూర్తి సహా కోర్టులో ఉన్న వారంతా పగలబడి నవ్వారు.
ఎంఎస్ ధోని, సత్య నాదెళ్ల మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది క్యాండీ క్రష్ గేమ్ ను చాలా ఇష్టపడుతుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆ గేమ్ తన హవా చూపిస్తోంది. ఇటీవల ధోని విమానంలో క్యాండీ క్రష్ ఆడుతూ వైరల్ గా మారిన వీడియో చూసిన తర్వాత.. కేవలం మూడంటే మూడు గంటల్లోనే మూడున్నర లక్షల మంది ఆ గేమ్ లో డౌన్లోడ్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలో.. ఇండిగో ఎయిర్ హోస్టెస్ ధోని కి చాక్లెట్లు, స్వీట్లు అందించడం.. వాటిని తీసుకోకుండా ధోని సీరియస్ గా గేమ్ లో మునిగిపోయాడు. ఈ వీడియో చూసిన వారంతా క్రికెట్ మైదానంలోనే కాదు క్యాండీ క్రష్ లోను ధోని మునిగిపోయాడని కామెంట్లు చేశారు. ధోని దెబ్బకు ఈ గేమ్ సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ టాపిక్ గా నిలిచింది. ధోని బాటలోనే సత్య నాదెళ్ల కూడా నడవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ధోనికి ఉన్న క్రేజ్ మరోసారి ప్రపంచానికి అర్థమైంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Microsoft ceo satya nadella joins candy crush craze just enjoys playing ms game
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com