Meter Collections: ‘మీటర్’ రెండు రోజుల వసూళ్లు..కనీసం పోస్టర్ ఖర్చులైన వచ్చాయా!

Meter Collections: ఒక సూపర్ హిట్ ఇస్తే అర్జెంట్ గా ఒక డిజాస్టర్ సినిమా ఇచ్చేయాలని కసితో ఉన్న హీరోలాగా కనిపిస్తాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇతని మొదటి సినిమా ‘రాజావారు రాణివారు’ అనే చిత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఉంటుంది కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన ‘SR కల్యాణ మండపం’ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఆ తర్వాత చేసిన సెబాస్టియన్ డిజాస్టర్ ఫ్లాప్ […]

Written By: Vicky, Updated On : April 8, 2023 6:08 pm
Follow us on

Meter Collections

Meter Collections: ఒక సూపర్ హిట్ ఇస్తే అర్జెంట్ గా ఒక డిజాస్టర్ సినిమా ఇచ్చేయాలని కసితో ఉన్న హీరోలాగా కనిపిస్తాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇతని మొదటి సినిమా ‘రాజావారు రాణివారు’ అనే చిత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఉంటుంది కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన ‘SR కల్యాణ మండపం’ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఆ తర్వాత చేసిన సెబాస్టియన్ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది,ఇక తనకి సరిపడే లవ్ స్టోరీ అయినా ‘సమ్మతమే’ చిత్రం తో మళ్ళీ సూపర్ హిట్ కొట్టాడు.

ఆ తర్వాత విడుదలైన ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ చిత్రం డిజాస్టర్ అయ్యింది.మొన్నీమధ్యనే వచ్చిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.దీనితో ఆయన తదుపరి చిత్రం ‘మీటర్’ కి మంచి బిజినెస్ జరిగింది.సుమారుగా థియేట్రికల్ రైట్స్ ఒక 5 కోట్ల రూపాయిల వరకు అమ్ముడుపోయింది.

నిన్ననే ఈ సినిమా గ్రాండ్ గా విడుదల అవ్వగా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.కమర్షియల్ సినిమా తో సూపర్ హిట్ కొట్టి, మాస్ ఇమేజి సంపాదించుకోవాలి అనుకున్న కిరణ్ అబ్బవరం ఆశలపై నీళ్లు చల్లింది ఈ చిత్రం.మైత్రి మూవీ మేకర్స్ నుండి ఇంత చెత్త సినిమానా అని నెటిజెన్స్ పెదవి విరిచేలా చేసింది ఈ సినిమా.మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది.ఇది ఆ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి చిల్లర వసూళ్లే అని చెప్పొచ్చు.ఇక రెండవ రోజు అయితే మారీ ఘోరం, కనీసం 12 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు.దీనిని బట్టీ ఈ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.

Meter Collections

క్లోసింగ్ కి కనీసం 50 లక్షల రూపాయిల షేర్ అయినా వస్తుందా లేదా అని సందేహిస్తున్నారు ట్రేడ్ పండితులు.అదే కనుక జరిగితే కనీసం పబ్లిసిటీ కి అయినా ఖర్చు కూడా రాలేదని అర్థం.కిరణ్ అబ్బవరం ఇక నుండైనా మేలుకొని మంచి స్క్రిప్ట్ ఎంచుకోకపోతే ఆడియన్స్ ఆయనని అస్సాం ట్రైన్ ఎక్కించి పంపిస్తారని అంటున్నారు ట్రేడ్ పండితులు.