మనలో చాలామందికి కారు కొనాలనే కోరిక ఉంటుంది. డబ్బులు తక్కువగా ఉంటే మామూలు కార్లను, ఎక్కువ ఉంటే లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటాం. కారు కొనుగోలు చేసిన తరువాత ఆ కారుకు ఎక్కడా చిన్న గీత కూడా పడకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తుంటాం. లగ్జరీ కార్ల విషయంలో ఐతే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే లగ్జరీ కార్లకు చిన్న చిన్న రిపేర్లకు కూడా లక్షల రూపాయలు ఖర్చవుతుంది.
లగ్జరీ కార్లకు మేజర్ యాక్సిడెంట్ అయితే మాత్రం కారుతో పాటు అందులో ఉండే మనుషులకు కూడా తీవ్ర గాయాలవుతాయి. ఎందుకంటే లగ్జరీ కార్ల వేగం ఎక్కువగా ఉంటుంది. తాజాగా స్విట్జర్లాండ్ లో లగ్జరీ కార్లు ప్రమాదానికి గురయ్యాయి. అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా చెప్పుకునే మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్ వ్యాగన్, పోర్చ్సే 911 క్యాబ్రియోలెట్, బుగట్టి చిరోన్ కార్లు స్విట్జర్లాండ్ లోని ఆల్ఫ్స్ లోని పిక్చర్ క్యూ ప్యాలెన్ లో ప్రయాణం చేస్తున్నాయి.
ఈ మూడు కార్లలో ఒక కారు ముందు వెళ్లే కారును ఓవర్ టేక్ చేయడానికి చేసిన ప్రయత్నంలో ప్రమాదం చోటు చేసుకుంది. జరిగిన ప్రమాదంలో మూడు కార్లు దారుణంగా దెబ్బ తినడం గమనార్హం. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయసహకారాలు అందించారు. అధికారులు ప్రమాదానికి గురైన మూడు కార్ల విలువ 40 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అక్కడి ప్రజలు మూడు కార్ల ప్రమాదాన్ని క్లాస్ ఆఫ్ రిచెస్ గా పేర్కొనడం గమనార్హం.