Megastar Chiranjeevi: సంక్రాంతి పండుగ మన అందరికీ అయ్యిపోయిందేమో కానీ, మెగాస్టార్ చిరంజీవి కి మాత్రం ఇంకా అవ్వలేదు..జనవరి 13 వ తారీఖున ప్రారంభమైన మెగా మాస్ జాతర నేటికీ కొనసాగుతూనే ఉంది..ఫ్యామిలీ ఆడియన్స్ ఒక సినిమాని నెత్తిన పెట్టుకుంటే ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో చెప్పడానికి ఉదాహరణగా నిలిచింది ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం..వారం రోజుల్లోనే వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో కూడా కళ్ళు చెదిరే వసూళ్లను రాబడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ హోల్డ్ ని చూపించుకుంది.

ఇంత పెద్ద సక్సెస్ సాధించిన తర్వాత విజయోత్సవ సభ వేలాదిమంది అభిమానుల సమక్ష్యం లో పెట్టుకోవాలి..అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు..ఎందుకంటే చిరంజీవి నుండి వరుసగా రెండు ఫెయిల్యూర్స్ తర్వాత వచ్చిన గ్రాండ్ సక్సెస్ ఇది..ఆ సక్సెస్ తాలూకు జ్ఞాపకాలను పదిలంగా చిరస్థాయిగా గుర్తుంచుకోవాలంటే కచ్చితంగా ఒక విజయోత్సవ సభ జరగాల్సిందే.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నారు..కనీవినీ ఎరుగని రీతిలో ఈ విజయోత్సవ సభ ని నిర్వహించడానికి ఏర్పాట్లు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు..కానీ మెగాస్టార్ చిరంజీవి నుండి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది..నిర్మాతలు ఇంకా చిరంజీవి కి ఈ విషయం ఖరారు చెయ్యలేదు..కొద్దీ రోజుల క్రితమే జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్ లో చిరంజీవి ప్రసంగిస్తున్న సమయం లో నిర్మాతలు ‘త్వరలోనే భారీ లెవెల్ లో సక్సెస్ మీట్ జరపబోతున్నాం సార్’ అని అనగానే ‘ఇంకా ఎన్ని సార్లు మాట్లాడిస్తారు నాతోటి..నేను తక్కువ మాట్లాడినాన ఏంటి..చాలు చాలు మీరిచ్చిన డబ్బులకు ఈమాత్రం మాట్లాడడమే ఎక్కువ..ఇదేమి బాలేదు.

ఒక్క పర్సు ఇచ్చి అన్నీ కావాలంటే కుదరదు’ అంటూ ఉత్తరాంధ్ర స్లాంగ్ లో చిరంజీవి సరదాగా మాట్లాడిన ఈ మాటలు నవ్వులు పూయించాయి..మరి నిర్మాతలు నిజంగానే చిరంజీవి కి అదనపు డబ్బులు కేటాయించి ఈ సక్సెస్ మీట్ కి ఒప్పిస్తారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న..చిరంజీవి సరదాగా మాట్లాడాడు అనే విషయం అందరికీ అర్థం అయ్యింది..కానీ సోషల్ మీడియా లో అభిమానులు సరదాగా ఇలా మైత్రీ మూవీ మేకర్స్ ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు.