https://oktelugu.com/

God Father Trailer : సల్మాన్ ఖాన్ తోడుగా చిరంజీవి ‘సీఎం’ ఫైట్..

God Father Trailer : మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గాడ్ ఫాదర్’ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి అదరగొట్టేశాడు. చివర్లో సల్మాన్ ఖాన్ ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది. నయనతార, సత్యదేవ్ పవర్ ఫుల్ పాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. గాడ్ ఫాదర్ ట్రైలర్ చూస్తే.. ‘ఒక రాష్ట్రానికి సీఎం ఆకస్మికంగా మరణిస్తాడు. ఆ కుర్చీ కోసం నయనతార, సత్యదేవ్ లు పోటీపడుతారు. కానీ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 28, 2022 / 08:16 PM IST
    Follow us on

    God Father Trailer : మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గాడ్ ఫాదర్’ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి అదరగొట్టేశాడు. చివర్లో సల్మాన్ ఖాన్ ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది. నయనతార, సత్యదేవ్ పవర్ ఫుల్ పాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

    గాడ్ ఫాదర్ ట్రైలర్ చూస్తే.. ‘ఒక రాష్ట్రానికి సీఎం ఆకస్మికంగా మరణిస్తాడు. ఆ కుర్చీ కోసం నయనతార, సత్యదేవ్ లు పోటీపడుతారు. కానీ ఖైదీగా జైళ్లో ఉన్న నాయకుడు చిరంజీవి సడెన్ గా బయటకు వచ్చి ప్రజలు, నేతల మద్దతుతో ఆ సీఎం సీటు కోసం ఫైట్ మొదలుపెడుతాడు. అతడిని అంతమొందించడానికి సత్యదేవ్ చేయని ప్రయత్నం ఉండదు..

    చివర్లో చిరంజీవిని కాపాడడానికి బాడీగార్డ్ లా సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇస్తాడు. సల్మాన్ , చిరంజీవి కలిసి పెద్ద పెద్ద గన్ లతో విలన్లను కాల్చే సీన్ సినిమాలో హైలెట్ గా నిలిచింది. వీరిద్దరు కనిపించినప్పుడు స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయింది. పూరి జగన్నాథ్ ట్రైలర్ మొదట్లో పలికిన డైలాగులు ఆకట్టుకున్నాయి.

    మొత్తంగా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ట్రైలర్ అనుకున్నదానికంటే ఓ రేంజ్ లో ఉంది. సినిమాపై అంచనాలు పెంచేసింది. అక్టోబర్ 5న దసరా సందర్భంగా ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.

    చిరంజీవి, సల్మాన్ ఖాన్ తోపాటు నయనతార, సత్యదేవ్ నటించిన ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకుడు.. పూరి జగన్నాథ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రాంచరణ్ తోపాటు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ లు నిర్మించారు. తమన్ సంగీతం అందించారు.