Balakrishna- Chandrababu And Chiranjeevi: ఇటీవల కాలంలో తెలుగులో వెబ్ సిరీస్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది. బిగ్ బాస్ లాంటి షోలతో బుల్లితెర దూసుకుపోతోంది. తాజాగా తెలుగులో మరో షో ప్రారంభం కాబోతోంది. దీనికి బాలకృష్ణ హోస్ట్ చేస్తుండటం విశేషం. ఇదివరకే బిగ్ బాస్ నాగార్జున హోస్ట్ చేస్తుండటంతో ఇక తెలుగులో మరో సంచలనం కానుంది. తెర వెనుక ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ లాంటి వారు ఉండటంతో ఈ చాట్ షో బ్లాక్ బస్టర్ గా నిలుస్తోంది. దీనికి క్రేజీ వస్తోంది. టీవీ షోలకు వచ్చే డిమాండ్ కన్నా దీనికి ఎక్కువగానే రావడం తెలుస్తోంది.

ప్రస్తుతం సీజన్ 2 ప్రారంభం అవుతోంది. దీనిలో థీమ్ సాంగ్ ప్రజాదరణ పొందుతోంది ప్రోమో సాంగ్ షూట్ ను రెండు రోజుల్లో చేయనున్నారు. దీంతో మొదటి సీజన్ కంటే రెండో సీజన్ పై అందరికి ఉత్కంఠ ఏర్పడుతోంది. రెండో సీజన్ సంగతేంటి? పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ జోడీ రానున్నట్లు సమాచారం. వీరు వస్తే రెండో సీజన్ మరింత రంజుగా మారనుంది. దీంతో భారీ ఓపెనింగ్ ఎపిసోడ్ గా మారుతుందని తెలుస్తోంది. సమయాభావం వల్ల కొన్నింటిని తీసేసినా షో మాత్రం పర్ ఫెక్ట్ గా వస్తోంది.
Also Read: Bigg Boss 6 Telugu RJ Surya: బిగ్ బాస్ లో ‘గే’లా మారిపోయిన ఆర్జే సూర్య.. మెంటలెక్కిపోయి అరాచకం
మొదటి సీజన్ కంటే రెండో సీజన్ లో ప్రముఖుల సంఖ్య పెరగనుంది. దీంతో షో నిడివి పెంచాలని చూస్తున్నా అది కుదురుతుందో లేదో తెలియడం లేదు. దీంతో పవన్, త్రివిక్రమ్ ల డేట్లు ఖరారు కాకపోవడంతో కొంత అనుమానం ఏర్పడుతోంది. మొత్తానికి వారు రావడానికే ప్రయత్నిస్తున్నారు. కానీ చివరి క్షణంలో ఏదైనా జరిగితే కుదరకపోవచ్చనే టాక్ వస్తోంది. రెండో సీజన్ కు మెగాస్టార్ చిరంజీవి కూడా వస్తారనే టాక్ వస్తున్నా అది నిజమో కాదో తెలియడం లేదు. అందువల్ల భారీ ఓపెనింగ్స్ ఉంటాయని భావిస్తున్నారు.

బాలకృష్ణ బావ నారా చంద్రబాబు నాయుడు కూడా వస్తారని ప్రచారం సాగుతోంది. ఇంకా అలనాటి హీరోయిన్ విజయశాంతి కూడా సెలబ్రిటీల జాబితాలో ఉందని చెబుతున్నారు. మొత్తానికి చాట్ షో సూపర్ డూపర్ గా దూసుకుపోతోంది. పొలిటికల్ లీడర్లు, సెలబ్రిటీలు రానుండటంతో షో బ్రహ్మాండంగా క్రేజీ సంపాదించుకుంటోంది. ఈ నేపథ్యంలో రెండో సీజన్ కు ఇంకా ఎవరెవరు వస్తారో అనే దానిపై సందిగ్దత నెలకొన్న సందర్భంలో షో ఏ మేరకు తన ప్రభావాన్ని చూపుతుందో తేలాల్సి ఉంది.