Homeఎంటర్టైన్మెంట్Megastar Chiranjeevi- 53rd IFFI 2022: మెగా ఘనత: అవమానించిన చోటే అవార్డ్ అందుకున్న...

Megastar Chiranjeevi- 53rd IFFI 2022: మెగా ఘనత: అవమానించిన చోటే అవార్డ్ అందుకున్న చిరంజీవి..

Megastar Chiranjeevi- 53rd IFFI 2022: మెగాస్టార్ చిరంజీవి.. బహుశా ఈ పేరు తెలియని వారు ఉండరు కావచ్చు. ఎప్పుడో ఒకప్పుడు ఈయన నటించిన సినిమాలో పాట, చేసిన డ్యాన్స్, పలికిన మాట, నటించిన సన్నివేశం, కదిలించిన చిత్రం… ఎంతోమందిని ప్రభావితం చేసి ఉంటాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సమ్మోహన శక్తి చిరంజీవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతటి చిరంజీవి ఎంతోమంది కళాకారులకు అవకాశాలు ఇచ్చారు. ఎన్నో వేల జీవితాలను నిలబెట్టారు. అలాంటి మేటి నటుడయిన చిరంజీవి గోవాలో నిర్వహించిన 53వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందుకున్నారు.

Megastar Chiranjeevi- 53rd IFFI 2022
Megastar Chiranjeevi- 53rd IFFI 2022

చాలా బాధపడ్డారు

చిరంజీవి దక్షిణాది నటుడు మాత్రమే కాదు. ఆయనకు భారతదేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దేశంలో సైతం ఆయన సినిమాలు దుమ్ము దులుపుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఆయన అవార్డు అందుకున్నప్పుడు కొంతమేర ఉద్వేగానికి గురయ్యారు. గతంలో ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సమయంలో ఒక దక్షిణాది నటుడి ఫోటో కూడా లేకపోవడం ఆయనను బాధించింది. తాను ఇన్ని సంవత్సరాలు నటిస్తున్నప్పటికీ… ఇన్నాళ్లకు అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ముగింపు వేడుకల్లో పురస్కారం అందించారు.. చిరంజీవికి ఈ పురస్కారం ఎప్పుడో రావాలి. ఎందుకంటే 90ల కాలంలోనే ఆయన భారత దేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటుడుగా పేరుగడించారు. కేవలం నటన మాత్రమే కాకుండా, సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందున్నారు.. అప్పట్లో ఆయన నటించిన సినిమాలు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసేవి.. ఒకానొక దశలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా చిరంజీవి లాంటి నటుడిని తాను ఇంతవరకు చూడలేదని కితాబు ఇచ్చారు..

45 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో

ఎక్కడో ఆంధ్రలో జన్మించిన కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి అంచెలు అంచెలుగా ఎదిగి మెగాస్టార్ చిరంజీవి అయ్యారు. ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారు. కోవిడ్ సమయంలో చిత్ర పరిశ్రమకు చెందిన వందలాది కుటుంబాలను ఆదుకున్నారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల మొత్తానికి ప్రాణవాయువు అందించారు. కొన్నిచోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు కూడా నిర్మించారు. 45 ఏళ్ల పాటు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న చిరంజీవికి ఈ అవార్డు రావడం ఆయన గౌరవాన్ని మరింత పెంచింది. కానీ ఈ అవార్డు ఆయనకు ఎప్పుడో రావాల్సి ఉంది. చిత్ర పరిశ్రమలో రకరకాల రాజకీయాలు ఉంటాయి. బహుశా ఆ రాజకీయాల వల్లే చిరంజీవికి అవార్డు రాలేదని తెలుస్తోంది. పైగా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇంతవరకు ఒక్క దక్షిణాది నటుడి ఫోటో కూడా లేదంటే అక్కడ ఎలాంటి రాజకీయాలు జరుగుతున్నాయో ఊహించుకోవచ్చు.

Megastar Chiranjeevi- 53rd IFFI 2022
Megastar Chiranjeevi

యువ హీరోలకు కష్టకాలమే

చిత్ర పరిశ్రమ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా స్వరూపం పూర్తిగా మారిపోయింది. కానీ ఇప్పటికీ కూడా సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అందరూ అనుకుంటున్నారు. ఉత్తరాదిని తలదన్నేలా దక్షిణాదిలో సినిమాలు రూ పొందుతున్నాయి. ఓ కాంతారా, కేజీఎఫ్, ఆర్ ఆర్ ఆర్,బాహుబలి ఇందుకు ఉదాహరణలు. అయితే చిరంజీవి లాంటి నటుడికే ఇటువంటి పురస్కారం వచ్చేందుకు ఇన్ని సంవత్సరాలు పడితే.. ఇప్పుడు ఉన్న యువతరం నటులు ఆ అవార్డు మీద ఆశలు వదిలేసుకోవాలి. 60 ఏళ్ల పైచిలుకు వయసులో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల్లో నటిస్తున్న చిరంజీవి.. ఏడాది ఇప్పటికే తన నుంచి రెండు సినిమాలు విడుదల చేశారు. ఆచార్య నిరాశాజనకమైన ఫలితాన్ని ఇవ్వగా, గాడ్ ఫాదర్ హిట్ గా నిలిచింది. త్వరలో వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి సంక్రాంతికి సందడి చేయనున్నారు. కాగా ఈ వయసులో మీరు సినిమాలో నటిస్తున్నారు అని విలేకరులు అడిగితే… నాకు నేనే పోటీ. నాకు ఎవరూ లేరు సాటి. అని చిరంజీవి సమాధానం ఇవ్వడం ఆయనలో పరిపూర్ణ నటుడికి సజీవ సాక్ష్యం

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular