https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘మెగా’ అప్డేట్.. ఫ్యాన్స్ ఖుషీ..!

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)’. ‘బాహుబలి’ రికార్డులను తిరగరాసేలా ‘ఆర్ఆర్ఆర్’ను జక్కన్న తీర్దిదిద్దుతున్నాడు. ప్యాన్ ఇండియా లెవల్లో రాబోతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్నారు. మెగా.. నందమూరి హీరోలు ఒకే స్క్రీన్ పై కన్పించనుండటంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అత్రుతగా ఎదురు చూస్తున్నారు. Also Read: ఆ హీరో పెళ్లిళ్లు పై మంచు లక్ష్మి కన్నీళ్లు ! అభిమానుల అంచనాలకు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 27, 2020 / 03:33 PM IST
    Follow us on

    దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)’. ‘బాహుబలి’ రికార్డులను తిరగరాసేలా ‘ఆర్ఆర్ఆర్’ను జక్కన్న తీర్దిదిద్దుతున్నాడు. ప్యాన్ ఇండియా లెవల్లో రాబోతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్నారు. మెగా.. నందమూరి హీరోలు ఒకే స్క్రీన్ పై కన్పించనుండటంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అత్రుతగా ఎదురు చూస్తున్నారు.

    Also Read: ఆ హీరో పెళ్లిళ్లు పై మంచు లక్ష్మి కన్నీళ్లు !

    అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇప్పటికే రిలీజైన ‘భీమ్ ఫర్ రామరాజు’.. ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లు యూట్యూబ్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఇక ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. హలీవుడ్ నటి ఓలివీయా.. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్.. సీనియర్ హీరోయిన్ శ్రియ వంటి భారాతారాగణం నటిస్తుంది. దీంతో ఈ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలు నెలకొన్నాయి.

    ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కొద్దిరోజులుగా ఏదో ఒక వార్తతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వర్షన్ కొమురంభీం.. అల్లూరి పాత్రలను పరిచయం చేసేందుకు అమీర్ ఖాన్ వాయిస్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకముందే మరో క్రేజీ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

    ‘ఆర్ఆర్ఆర్’లో మెగాస్టార్ చిరంజీవి భాగస్వామ్యం కాబోతున్నాడనే న్యూస్ వైరల్ అవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు వర్షన్లో ఎన్టీఆర్.. రాంచరణ్ పాత్రలను పరిచయం చేయడానికి మెగాస్టార్ వాయిస్ ఇవ్వనున్నారట. ఈమేరకు దర్శకుడు రాజమౌళి చిరంజీవిని అడిగిన వెంటనే ఆయన ఒప్పుకున్నారనే టాక్ విన్పిస్తోంది. ఇందులో వాస్తవమెంతోగానీ ఈ న్యూస్ పట్ల మాత్రం మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    Also Read: గాన గంధర్వుడి అభిమానులకు శుభవార్త !

    హిందీ వర్షన్లో అమీర్ ఖాన్.. తెలుగులో చిరంజీవి.. మిగతా దక్షిణాది భాషల్లో ఆయా ఇండస్ట్రీలకు చెందిన సూపర్ స్టార్లతో వాయిస్ ఓవర్ ఇప్పించేందుకు దర్శకుడు రాజమౌళి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీకి ఆయా భాషల్లో మంచి మైలేజ్ రావడం ఖాయంగా కన్పిస్తోంది.

    ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్లలో కొమురంభీం పాత్రను రాంచరణ్.. అల్లూరి పాత్రకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆకట్టుకుంది. తాజాగా మిగతా భాషల్లోని హీరోలు కూడా ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇవ్వనుండటంతో సినిమాకు మరింత ప్లస్ కానుంది. ఇక ఈ మూవీని డీవీవీ దానయ్య 400కోట్ల భారీ బడ్జెట్లో నిర్మిస్తుండగా కీరవాణి అద్భుతమైన బాణీలను అందిస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్