Homeఆంధ్రప్రదేశ్‌YCP - BRS: వైసీపీ, బీఆర్ఎస్ మధ్య వైరం వ్యూహమా? ఎత్తుగడా?

YCP – BRS: వైసీపీ, బీఆర్ఎస్ మధ్య వైరం వ్యూహమా? ఎత్తుగడా?

YCP - BRS
YCP – BRS

YCP – BRS: సెంటిమెంట్ ను వర్కవుట్ చేసుకోవడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. టీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత సెంటిమెంట్ ను రగిల్చినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ రాష్ట్ర విభజన నాటి నుంచి కేసీఆర్ మాటలను తెలంగాణ సమాజం నమ్ముతూ వస్తోంది. అయితే దానికి కేసీఆర్ ప్రయోగించేంది సెంటిమెంట్ అస్త్రమే. వైఎస్ మరణంతో తెలంగాణ సమాజానికి చంద్రబాబును చూపించి కేసీఆర్ భయపెట్టారు. గత రెండు ఎన్నికల్లో చంద్రబాబును చూపి.. సీమాంధ్ర పాలన అంటూ ప్రజల్లో గట్టి ఆలోచన తెచ్చిపెట్టారు. దీంతో ప్రజలు కేసీఆర్ కు పట్టం కట్టారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం జాతీయ పార్టీ హోదాలో పోటీచేస్తున్నారు. ప్రాంతీయ వాదాన్ని పక్కనపడేసి జాతీయ వాదం ఎంచుకుంటారని అంతా భావించారు. కానీ ఏపీ మంత్రుల నుంచి విమర్శలు చూస్తుంటే మళ్లీ సెంటిమెంట్ ను నమ్ముకున్నారా? అన్న అనుమానాలు కలగక మానవు.

స్థాయికి మించి విమర్శలు..
పొరుగు రాష్ట్రాల పాలనపై ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు విమర్శలు చేసుకోవడం, స్పందించడం సాధారణ విషయం. ఆ విమర్శలు కూడా తమ పరిధి లోపలే చేసుకుంటారు. హద్దులు దాటి విమర్శలు చేస్తే మాత్రం ఎక్కడో ఒక అనుమానం కొడుతుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య జరుగుతున్న అనుమానాలు చూస్తే అదే జరుగుతోంది. ఎన్నికల వేళ ఉమ్మడిగా మైండ్‌గేమ్ మొదలుపెట్టాయేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విభజన సమస్యలపై కూడా కూల్‌గా ఉన్న ఇరు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఇప్పుడు మాత్రం పెద్ద హడావుడి జరిగినట్టు ప్రవర్తిస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ పరస్పర రాజకీయ ప్రయోజనాలతో పాటు ఉమ్మడి శత్రువును ఎదుర్కొన్న వీరు టర్న్ అయ్యేసరికి అందరిలోనూ ఒక రకమైన అనుమానం వెంటాడుతోంది.

అనుమానాలకు ఇవేకారణం..
అయితే ఈ వైరం ఎంపికలో సైతం జూనియర్ మంత్రిని ఎంచుకోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. నోటికి పనికి చెప్పే చాలా మంది సీనియర్లు ఉండగా.. జూనియర్ గా ఉన్న సీదిరి అప్పలరాజు స్పందించడం.. అది కూడా కాస్తా అతిగానే ఉండడం అనుమానాలకు తావిస్తోంది.
అప్పలరాజు చేసిన కామెంట్స్ చిన్నవి కావు. భావోద్వేగాలను రెచ్చగొట్టేలా చేసినవే. కేసీఆర్ కుటుంబాన్ని తాగుబోతులుగా మాట్లాడారు. తిరుగుబోతులుగా, అవినీతిపరులుగా కూడా కామెంట్స్ చేశారు. అంతకు మించి తెలంగాణ ప్రజలపై కూడా గట్టిగానే మాట్లాడారు.
‘తెలంగాణ వాళ్లకు బుర్ర తక్కువ’ అంటూ ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న ఇరు పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయేమోనని పొలిటికల్ సర్కిల్స్‌లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

YCP - BRS
YCP – BRS

పరస్పర ప్రయోజనాల కోసమేనా?
ఈ ఏడాది చివరిలో తెలంగాణ ఎన్నికలు, వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పరస్పర రాజకీయ ప్రయోజనాల కోసం.. ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకే ప్లాన్ చేసి ఉంటారన్న అనుమానం పెరుగుతోంది. బీజేపీ కోసం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల నాటికి బీజేపీ, జనసేనతో కూటమి కట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే జరిగితే తెలంగాణలో సైతం బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. బీఆర్ఎస్ కు నష్టం జరుగుతుంది. ఏపీలో జగన్ కు సైతం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే వ్యూహాత్మకంగా పరస్పర రాజకీయ ఆరోపణలు చేసుకోవడానికి వ్యూహం పన్నారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular