
Naveen Murder Case: హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ లో జరిగిన బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో రోజురోజుకు సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసుల విచారణలో బయటకు వస్తున్న వాస్తవాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. అయితే నవీన్ ను చంపింది తానేనని, దీనంతటికీ కారణం ప్రియురాలు నిహారికను వేధించడమే అని హరి హర కృష్ణ పోలీసుల ఎదుట నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇక హరి హర కృష్ణ కస్టడీ ముగిసింది.
ఇలా పరిచయం
బీటెక్ సెకండియర్ నుంచి హరిహర కృష్ణకు నవీన్ ఫ్రెండ్. వేరు వేరు చోట్ల ఇంజనీరింగ్ చదువుతున్నప్పటికీ తరచూ కలుసుకునేవారు. అయితే నిహారిక, నవీన్ తొలుత ప్రేమించుకున్నారు. అయితే వారి ప్రేమ విషయాలను హరి హర కృష్ణ కు నవీన్ చెప్పేవాడు. ఈ క్రమంలో నవీన్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని నిహారిక గొడవ పడింది. ఈ గొడవ వారిద్దరి మధ్య బ్రేకప్ కు దారి తీసింది. దీంతో నవీన్ నిహారిక కు ప్రపోజ్ చేశాడు.. దీనికి ఆమె కూడా సరేనంది.. అయితే వీరిద్దరి మధ్య వ్యవహారం నవీన్ కు తెలియదు. దీంతో నవీన్ నిహారిక కు కాల్స్, మెసేజెస్ చేస్తుండేవాడు. మీ అమ్మకు నచ్చేది కాదు. అయితే ఈ విషయాన్ని నిహారిక హరిహరకు చెప్పింది.
ఎప్పుడైతే నిహారిక హరిహర కు విషయం చెప్పిందో అప్పుడే నవీన్ హరిహరను మార్చాలని నిర్ణయించుకున్నాడు.. అతనితో స్నేహం నటిస్తూనే ఆనుపానులు తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే అతని మన బంధానికి అడ్డు లేకుండా చేయాలని నిహారిక చెప్పడంతో నవీన్ మరింత రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే మలక్ పేట డీ మార్ట్ లో ప్లాస్టిక్ గ్లౌజులు కొన్నాడు.. వాటిని ఇంట్లో ఎవరికీ కనిపించకుండా దాచాడు. ఈ క్రమంలోనే కనుమ పండుగ సందర్భంగా స్నేహితులు మొత్తం కలుసుకున్నారు. మద్యం తాగారు.. అప్పుడే నవీన్ ను చంపాలని హరిహర అనుకున్నప్పటికీ అది కుదరలేదు.. మరోవైపు ఫిబ్రవరి 17న హైదరాబాద్ వస్తున్నానని నవీన్ హరిహరకు చెప్పాడు. దీంతో హరిహర నవీన్ ను పికప్ చేసుకొని నాగోల్ తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరు కలిసి భోజనం చేశారు. తర్వాత నవీన్ హరిహర మలక్పేట లోని తన ఇంటికి తీసుకెళ్లాడు. సాయంత్రం అయిన తర్వాత నేను హాస్టల్ వెళ్తానని నవీన్ అంటే… అతనితో పాటు హరిహర వెళ్ళాడు. ఇదే చాన్స్ అనుకుని ఇంట్లో దాచిన కత్తి, గ్లౌజులు కూడా తీసుకెళ్లాడు. ఔటర్ రింగ్ రోడ్డు దాటిన తర్వాత… మద్యం తాగుదామని నవీన్ ను హరిహర తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి ఫూటు గా మద్యం తాగారు. బండిమీద నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. ఇద్దరు కూడా నిహారిక విషయంలో గొడవపడ్డారు. అసలే కోపం మీద ఉన్న హరిహర నవీన్ ను ఒక తోపు తోసాడు. కింద పడిన వెంటనే గొంతు నిలిమి హత్య చేశాడు.. చనిపోయాడని నిర్ధారించుకున్నాక కత్తితో అతడి శరీర భాగాలను మొత్తం కోశాడు. శవాన్ని చెట్లపొదల్లో పడేసాడు.

అతడు శరీర భాగాలను సంచిలో వేసుకొని బ్రాహ్మణపల్లి వైపు వెళ్ళాడు. గృహకల్ప వెనుక భాగంలో పడేశాడు. ఆ తర్వాత అదే ప్రాంతంలో ఉంటున్న తన ఫ్రెండ్ హసన్ ఇంటికి హరిహర వెళ్ళాడు. అక్కడ బట్టలు మార్చుకొని జరిగిన విషయాన్ని హాసన్ కు చెప్పాడు. పోలీసులకు లొంగిపోవాలని హసన్ చెప్పేశాడు. ఉదయం నుండి పోతానని చెప్పి ఆ రక్తపు దుస్తులను సాగర్ కాంప్లెక్స్ వద్ద చెత్తకుప్పల పడేసాడు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నిహారికకు ఫోన్ చేసి రమ్మన్నాడు. జరిగిన విషయాలు మొత్తం చెప్తే, ఆమె అతన్ని తిట్టింది. బైక్ పైన ఆమెను ఇంటి వద్ద దిగబెట్టి తన ఇంటికి వెళ్ళాడు. జరిగిన విషయాన్ని తన తండ్రితో చెప్తే లొంగిపోవాలని సూచించాడు. 24న హాసన్ ఇంటికి వెళ్లిన నవీన్ ను… ఇంకా లొంగి పోలేదా అంటూ హసన్ తిట్టాడు. శరీర భాగాలు పడేసిన సంచిని మళ్ళీ తీసుకెళ్లి హత్య జరిగిన ప్రాంతంలో కాల్చేశాడు. తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. అయితే హరిహర చెప్పిన వివరాల ఆధారంగా నిహారికను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనగా మారింది. ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇద్దరు స్నేహితులు కొట్టుకోవడం, వారిలో ఒకడు కిరాతకుడిగా మారి, మరొకడిని హతమార్చడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.