Mega 157: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి(Anil Ravipudi) తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు ఇటీవలే రామానాయుడు స్టూడియోస్ లో జరిగాయి. ఈ ఈవెంట్ కి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టాడు. అల్లు అరవింద్, దిల్ రాజు వంటి ప్రముఖులు కూడా ఈవెంట్ లో పాల్గొన్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నెల నుండి మొదలు కానుంది. అయితే కాసేపటి క్రితమే అనిల్ రావిపూడి సోషల్ మీడియా లో ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియో ని విడుదల చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. తన ప్రతీ చిత్రాన్ని సరికొత్త రీతిలో ప్రమోట్ చేసే అలవాటు ఉన్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు కూడా అదే పద్దతిని అనుసరించాడు. ఈ చిత్రానికి పని చేసే టీం ని తనడైన శైలిలో పరిచయం చేశాడు.
Also Read: సందీప్ రెడ్డి వంగ ను చూసి భయపడుతున్న ప్రభాస్…కారణం ఏంటంటే..?
చిరంజీవి పాత సినిమాల్లోని డైలాగ్స్ ని ఉపయోగించుకుంటూ, ఒక్కో డిపార్ట్మెంట్ ని పరిచయం చేయడం ఆసక్తికరంగా మారింది. చివర్లో అనిల్ రావిపూడి ఈ గ్యాంగ్ మొత్తానికి లీడర్ గా పరిచయం చేసుకుంటూ ‘వచ్చే సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం’ సార్ అని అంటాడు. ‘అంతొద్దు అమ్మా’ అని చిరంజీవి అనగానే, అనిల్ రావిపూడి కాస్త తగ్గి, ఈసారి రఫ్ఫాడించేద్దాం సార్ అని చిన్నగా అంటాడు. ‘ఇది చాలు’ అని అంటాను అనుకున్నావా?, సరిపోదు ఇంకా పెద్దగా చెప్పు అని అంటాడు. అలా అనిల్ రావిపూడి మార్క్ తో ఈ వీడియో ని విడుదల చేయగా, దానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో ని మీరు కూడా క్రింద చూసేయండి. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి ‘చిరు నవ్వుల పండుగ’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్స్ గా అదితి రావు హైదరి(Aditi Rao Hydari), భూమిక నటిస్తారని నిన్న మొన్నటి వరకు ప్రచారం సాగింది.
అదితి రావు హైదరి అయితే నటిస్తుంది కానీ, భూమిక బదులుగా బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా నటిస్తున్నట్టు సమాచారం. పరిణీతి చోప్రా(Parineeti Chopra) ప్రముఖ బాలీవుడ్/హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కి సోదరి అనే విషయం అందరికి తెలిసిందే. ఇదే ఆమెకు మొట్టమొదటి టాలీవుడ్ సినిమా అవ్వొచ్చు. ఇకపోతే ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ సెకండ్ హాఫ్ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్. ఆద్యంతం వినోదం తో సాగే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి లోని వింటేజ్ కామెడీ టైమింగ్ ని బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నాడు అనిల్ రావిపూడి. మరి ఆయన ఈ ప్రయత్నంలో ఎంత వరకు సక్సెస్ అవుతాడు అనేది చూడాలి. ఈరోజు విడుదల చేసిన వీడియో, పూజ కార్యక్రమం జరిగిన రోజే షూట్ చేసినట్టు తెలుస్తుంది.
Meeting our gang of #Mega157
Loved it @anilravipudi, i can imagine how entertaining the shoot is going to be on the sets!
SANKRANTHI 2026 రఫ్ఫాడిద్దాం #ChiruAnil @Shine_Screens @GoldBoxEnt pic.twitter.com/ZKMv76vGfX
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 1, 2025