Homeట్రెండింగ్ న్యూస్Ronald Wayne : యాపిల్‌ను వదులుకున్న దురదృష్టవంతుడెవరో తెలుసా.. చరిత్రలో నష్టజాతకుడిగా మిగిలింది అతడే!

Ronald Wayne : యాపిల్‌ను వదులుకున్న దురదృష్టవంతుడెవరో తెలుసా.. చరిత్రలో నష్టజాతకుడిగా మిగిలింది అతడే!

Ronald Wayne : ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు ఎవరో తెలుసా? జపాన్‌కు చెందిన సుటోము యమగుచి. ఎందుకంటే? ఇతను రెండో ప్రపంచ యుద్ధం సమయంలో హిరోషిమా, నాగసాకి అణు బాంబు దాడుల నుంచి బయటపడ్డాడు. 1945, ఆగస్ట్‌ 6న అమెరికా యుద్ధ విమానం ఎనోలాగే ‘లిటిల్‌ బాయ్‌’ అనే బాంబును హిరోషిమాపై జారవిడిచింది. ఒక్క క్షణంలోనే నగరంలోని 2.5 లక్షల జనాభాలో 80 వేల మంది మృత్యువాతపడ్డారు. సరిగ్గా ఆ బాంబు ప్రదేశం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సుటోము ప్రాణాలతో బయటపడ్డారు. సుటోము యమగచి ఉన్న ప్రాంతంలో ప్రాణాలతో బయపడింది ఇతను ఒక్కడే. జపాన్‌ ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ఏకైక వ్యక్తి ఇతడే. అందుకే ప్రపంచంలోనే అంత్యంత లక్కీయెస్ట్‌ పర్సన్‌గా గుర్తింపు పొందారు.
మరి ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతుడు ఎవరో తెలుసా? రోనాల్డ్‌ వేన్‌. వ్యాపార ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ మూడో కోఫౌండర్‌. మరి అన్‌ లక్కీయెస్ట్‌ పర్సన్‌ ఎందుకంటే 290 బిలియన్‌ డాలర్ల షేర్లను కేవలం 800 డాలర్లకే అమ్మేశాడు. కాబట్టే ఇతనే వరల్డ్‌లోనే అన్‌ లక్కీయెస్ట్‌ పర్సన్‌గా అప్రతిష్ట మూటగట్టుకున్నాడు.
1976లో కంపెనీ ఏర్పాటు.. 
1976, ఏప్రిల్‌ 1న కాలిఫోర్నియాలో స్టీవ్‌ వోజ్నియాక్‌(21), స్టీవ్‌ జాబ్స్‌(25), అనుభవంలో, వయస్సులో పెద్దవారైన రోనాల్డ్‌ వేన్‌(42)తో కలిసి యాపిల్‌ కంపెనీని ప్రారంభించారు. అదే రోజు యాపిల్‌ ముగ్గురు వ్యవస్థాపకుల్లో ఒకరైన రోనాల్డ్‌ వేన్‌.. కంపెనీలో ఎవరి బాధ్యతలు ఏంటో తెలుపుతూ ఓ అగ్రిమెంట్‌ రాశారు. దీంతోపాటు యాపిల్‌ ప్రొడక్ట్‌కు సంబంధించిన తొలి లోగోని తయారు చేశారు. ఐజాక్‌ న్యూటన్‌ ఒక చెట్టు కింద యాపిల్‌ తింటున్న ఫొటోని తయారు చేసింది ఇతనే. ఈ లోగోని ఏడాది కంటే తక్కువ కాలం ఉపయోగించింది యాపిల్‌ సంస్థ.
12 రోజులకే భారీ ఆర్డర్‌ 
ఇక, స్టీవ్‌ వోజ్నియాక్, స్టీవ్‌ జాబ్స్, రోనాల్డ్‌ వేన్‌ భాగస్వామ్యంలో యాపిల్‌ సేవల్ని ప్రారంభించింది. కేవలం 12 రోజుల వ్యవధిలో అమెరికాలోనే తొలి యాపిల్‌ 1 కంప్యూటర్‌ను అమ్మిన కంప్యూటర్‌ రీటైల్‌ సంస్థ ‘బైట్‌ షాప్‌’ తమకు 100 కంప్యూటర్లను తయారు చేసి పెట్టాలంటూ యాపిల్‌కు ఆర్డర్‌ ఇచ్చింది. ఆర్డర్‌ వచ్చింది. కానీ, తయారు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వలేదు. అప్పుడే కంప్యూటర్ల తయారీకి వినియోగించే పరికరాల కోసం స్టీవ్‌ జాబ్స్‌ 15 వేల డాలర్ల లోన్‌ తీసుకున్నారు. నిర్ధేశించిన గడువులోగా స్టీవ్‌ జాబ్స్‌ యాపిల్‌ కంప్యూటర్లను తయారు చేసి ఇచ్చారు. ఒప్పందం ప్రకారం.. కంప్యూటర్లను తయారు చేసి అప్పగించారు. కానీ తయారు చేసిన కంప్యూటర్ల తాలుకు బిల్స్‌ ఆగిపోయాయి.
కొనసాగలేక వాటా అమ్మేసి.. 
ఓవైపు లోన్, మరో వైపు బైట్‌షాప్‌ నుంచి రావాల్సిన డబ్బులు రాలేదు. అందుకే సంస్థలో కొనసాగితే ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని బయపడ్డారు రోనాల్డ్‌ వేన్‌. యాపిల్‌ సంస్థ నష్టపోతే యువకులైన వోజ్నియాక్, జాబ్స్‌కు ఏమీ కాదు. ఎందుంకటే వాళ్ల చేతిలో ఏమీ లేవు. వేన్‌ అలా కాదు. అప్పటికే ధనవంతుడు. ఆస్తిపాస్తులు బాగానే సంపాదించారు. అందుకే తాను యాపిల్‌ సంస్థను వదిలేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే యాపిల్‌లో ఉన్న తన 10 శాతం వాటాను కేవలం 800 డాలర్లకు తన సహచరులకు అమ్మేశాడు. ఇలా యాపిల్‌ సంస్థను విడిచిపెట్టాలని వేన్‌ తీసుకున్న నిర్ణయం అతనికి పెద్ద నష్టాన్ని మిగిల్చింది.
ఆ 10 శాతం విలువ నేడు 290 బిలియన్లు..
నాడు వేన్‌ అమ్మేసిన యాపిల్‌ 10 శాతం వాటా విలువ ప్రస్తుతం 290 బిలియన్ల కంటే ఎక్కువగా ఉంటుంది. అదే వాటా వేన్‌ను సైతం ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలబెట్టేది. కానీ ఆ నిర్ణయమే ప్రపంచంలోనే అత్యంత అన్‌ లక్కీయెస్ట్‌ పర్సన్‌గా నిలబెట్టింది. ఆశ్చర్యం ఏమిటంటే.. వేన్‌ తన నిర్ణయానికి ఇప్పటికీ చింత లేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. యాపిల్‌ సంస్థ అభివృద్ధి చెందకుంటే.. తాను రాబోయే 20 సంవత్సరాలపాటు డాక్యుమెంటేషన్‌ విభాగంలో విభాగంలో విధులు నిర్వహించాల్సి వచ్చేదని పేర్కొన్నాడు.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version