Matrimonial Ad- Software Engineers: సముద్రం లోతు ఆడవారి మనసు తెలియదంటారు. వారి మనసులో ఏముందో ఎవరికి కూడా అర్థం కాదట. అంతటి ఆలోచనలు వారికుంటాయనడంలో సందేహం లేదు. ఇటీవల కాలంలో పెళ్లి సంబంధాలు ఆడవారికి ఇష్టమైన వాడినే సెలెక్ట్ చేసుకుంటున్నారు. పూర్వం రోజుల్లో స్వయంవరం లాంటివి ఉండేవి. దేశదేశాల రాజులందరు స్వయంవరానికి విచ్చేసి అక్కడ పెట్టిన పరీక్షలో విజయం సాధిస్తే వారే రాజకుమారిని వివాహం చేసుకునే వారు. రామాయణంలో శ్రీరాముడు సీతను అలాగే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంకా పాండవులు కూడా ద్రౌపదిని అలాగే సొంతం చేసుకున్న విషయం మనం చదువుకున్నాం.

రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ఆలోచనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇన్నాళ్లు సంప్రదాయబద్ధంగా జరిగే పెళ్లిచూపులు నేటి కాలంలో వినూత్న పోకడలు సంతరించుకుంటున్నాయి. అమ్మాయిలు వారికి ఏ రకమైన వాడు కావాలో వారే స్వయంగా చెబుతున్నారు. పెళ్లి ప్రకటనల్లో తమకు ఎలాంటి అర్హతలుండాలనేదానిపై స్పష్టత ఇస్తున్నారు. 24 ఏళ్ల యువతి ఇచ్చిన పెళ్లి ప్రకటనలో తనకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వద్దని చెప్పడం సంచలనం కలిగిస్తోంది. ప్రస్తుత కాలంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కావాలని కన్నెపిల్లలు కలలు కంటుంటే ఈమె మాత్రం తనకు అలాంటి వాడు వద్దని ప్రత్యేకంగా చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: Sunny Leone: తెలుగు వారికి అందాల కనువిందు.. సన్నిలియోన్ హాట్ పిక్స్ భలే పసందు
సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయితే లక్షల్లో వేతనం, మంచి జీవితం అని అందరు ఆశపడుతుంటారు. కానీ ఈవిడకు మాత్రం డాక్టర్, ఇంజినీర్, ఐఏఎస్, ఐపీఎస్ లు భర్తగా రావాలట. కానీ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మాత్రం వద్దని సూచించడం దేనికి సంకేతమో తెలియడం లేదు. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మీద ఎందుకంత ఆగ్రహమో తెలియడం లేదు. ప్రత్యేకంగా పెళ్లి ప్రకటనలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయి ఉండకూడదని ప్రత్యేకంగా ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. బయట మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఉద్యోగం సాఫ్ట్ వేర్. కానీ ఆమె మాత్రం వారిని వద్దంటూ చెప్పడమే అన్ని సందేహాలకు మూలం అవుతోంది.

సాఫ్ట్ వేర్లంటే అంత చులకనా? వారేం చేశారు? పెళ్లిళ్లు చేసుకుని సంసారాలు చేయడం లేదా? ఎక్కడో ఏదో జరిగితే దాన్ని ప్రామాణికంగా తీసుకుని వారిని వద్దనడం ఏమిటనే ప్రశ్నలుకూడా వస్తున్నాయి. తమ కూతురుకి సాఫ్ట్ వేర్ నిచ్చి పెళ్లి చేయాలని ప్రతి తండ్రి ఆరాటపడుతుంటాడు. కానీ ఇక్కడ మాత్రం ఆమె తన నిర్ణయం ప్రకటించి అందరిలో సందేహాలు వచ్చేలా చేస్తోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగితో జీవితం బాగుంటుందని భావించే వారే అధికంగా ఉన్నా ఆమె మాత్రం డాక్టర్, బిజినెస్ మేన్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాళ్లే కావాలని చెప్పి కింద సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు మాత్రం ఫోన్ చేయొద్దని ప్రత్యేకంగా ప్రకటించి వారి మనోభావాలను దెబ్బతీసిందనే వాదనలు సైతం వస్తున్నాయి. మొత్తానికి సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం తెగ వైరల్ అవుతోంది. సాఫ్ట్ వేర్ల పరువు కాస్త గంగలో కలిపిందనే విమర్శలు వస్తున్నాయి.
Also Read: Ram Column: హైదరాబాద్ విమోచన పోరాటం – అపోహలు, వాస్తవాలు
Rwcommended videos: