Maternity Photoshoot: ఫొటో షూట్ పీక్స్‌కు చేరుతోంది. పెళ్లిళ్ల కోసం వచ్చిన ఈ కొత్త ట్రెండ్ క్రమంగా జీవితంలోని అన్ని అంశాలకూ విస్తరిస్తోంది. లైఫ్‌లో జరిగే ప్రతీ అంశాన్ని ఫొటో షూట్ చేయడానికి కొంతమంది పాకుడుతున్నారు.. ఈ వెర్రి ఇలాగే పోతే.. రాబోయే రోజుల్లో చావును కూడా ఫొటోషూట్ చేసేలా కనిపిస్తోంది. తాజాగా ఓ వివాహిత ఫొటో షూట్ పిచ్చితో.. గర్భంతో ఫొటో షూట్ చేయించుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజట్లు మండిపడుతున్నారు.
గర్భంతో డ్యాన్స్..
ఓ గర్భిణి ఫొటో షూట్ కోసం.. నిండు గర్భంతో ఓ లొకేషన్‌కు వెళ్లింది. అక్కడ ప్రత్యేకంగా డ్రెస్సింగ్ చేసుకుంది. ఫొటోలు, షూట్ మామూలుగా దిగితే మజా ఏముంటుందనుకుంది. దీనికి వీడియో, ఫొటో గ్రాఫర్లు కూడా సలహాలు ఇచ్చారు. దీంతో నిండు గర్భంతో డాన్స్ చేస్తూ ఫొటో షూట్ చేయించుకుంది. తమిళనాడులో షూట్ చేసినట్లు కనిపిస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మండిపడుతున్న నెటిజన్లు..
ఈ మెటర్నటీ ఫొటో షూట్‌పై కొంతమంది మండిపడుతుండగా, మరికొందరు.. ఎక్సర్సైజ్ అవుతుందని అభినందిస్తున్నారు. పోయేకాలం వస్తే ఇలానే ఫొటోలపై మోజు పడతారని కతను కామెంట్ చేశాడు. మరీ దారుణంగా తయారేంటి అని మరొకరు.. ప్రీ డెత్ షూట్ అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు. ఇక శోభనం షూట్ ఒక్కటే మిగిలి ఉంది.. అని కొంతమంది.. భవిష్యత్‌లో ఇలాంటి ఖర్మ వీడియోలు ఎన్ని చూడాలో అంటూ ఇంకొంతమంది కామెంట్ పోస్టు చేశారు. ప్రపంచంలో ఇలాంటి వింత పోకడలు ఇంకెన్నిచూడాలిరా బాబు అని మరొకరు పోస్టు చేశారు.
మాతృత్వం మరో జన్మ..
మాతృత్వం అనేది స్త్రీలకు మరో జన్మలాంటిది. అలాంటి మాతృత్వానికి నిలయం గర్భం.. కడుపుతో ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలి.. ఒత్తిడికి లోనుకావొద్దు.. సుఖ ప్రసవం కోసం మంచి ఆహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తుంటారు. కానీ, కొంతమంది వెర్రి ఇలా పిచ్చి ఫొటో షూట్‌లకు దారి తీస్తోంది. ఏమాత్రం పొరపాటు జరిగిన తల్లితోపాటు కడుపులోని బిడ్డకు కూడా ప్రమాదం తప్పదు. ఇలాంటి సమయంలో ఇలా ఫొటో షూట్‌చేయడంపై విరమ్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు కూడా ఇలాంటివి మంచిది కాందటున్నారు.