Wedding Cancel: దేశంలో వరకట్నం నిషేధం. కానీ ఈ చట్టాలు చేసిన ప్రతినిధులు, చట్టాలను అమలు చేసే వారు కూడా తమ పిల్లలకు కూడా కట్నాలు ఇస్తూనే ఉన్నారు. వరకట్న నిషేధ చట్టం ఎక్కడా సక్రమంగా అమలు కావడం లేదు. దీంతో వరకట్నం కోసం వేధింపులు, హత్యలు, ఆత్మహత్యలు ఆగడం లేదు. పెళ్లికి ముందే కట్న కానుకలు మాట్లాడుకుని, పెళ్లి రోజు నాటికి ముట్టజెబితేనే వివాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ కట్నం అనే కులాలు, మతాలు, జామాసిక స్థితిగతుల ఆధారంగా వేర్వేరుగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. ఓ పెళ్లిలో వరుడు అమ్మాయి కుటుంబ సభ్యులను కట్నం డిమాండ్ చేశాడు. అడిగిన కట్నం ఇవ్వలేదని చివరకు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతని కట్నం డిమాండ్ చూసి ఆశ్చర్యపోతున్నారు.
రూ.2 లక్షల డిమాండ్..
ఈ వీడియోలో పెళ్లి వేదిక వద్ద ఒక వరుడు అమ్మాయి కుటుంబంతో కట్నం గురించి మాట్లాడుతుండటం స్పష్టం కనిపించింది. వరుడు రూ.2 లక్షలు మాట్లాడారని, అందులో రూ.50 వేలు మాత్రమే అందాయని అంటున్నాడు. రూ.1.50 లక్షలు ఇస్తే తప్ప పెళ్లి చేసుకోనని తెగేసి చెబుతుండటం కూడా కనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు 3 లక్షల మందికిపైగా వీక్షించారు. . వామ్మో ఇలా ఉన్నాడేంటి అంటూ షాక్ అవుతున్నారు.
వరుడిపై ఆగ్రహం..
వైరల్‌గా మారిన ఈ వీడియోపై జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు స్పందిస్తూ.. ఎవరూ మీకు రూ.150 కూడా ఇవ్వకూడదని అంటున్నారు. మరో వినియోగదారు, ‘నీకు ఒక అమ్మాయిని ఇచ్చారు, అది చాలు’ అని రాశారు. ‘ఇదంతా చూస్తుంటే బ్రిటీష్ వాళ్ల నుంచి మనకే కాకుండా బ్రిటీష్ వాళ్లే మన నుంచి విముక్తి పొందినట్లు అనిపిస్తోందంటూ మరో యూజర్ ఫన్నీగా కామెంట్ చేశారు.
View this post on Instagram